Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదరికమే ద్వేషానికి కారణమని తెలిశాక అమ్మానాన్న మరింత అర్థమయ్యారు: పరిణీతి చోప్రా

సైకిల్‌లో స్కూలుకు వెళుతుంటే అబ్బాయిలు స్కర్ట్ లాగినప్పుడు, గేలి చేసినప్పుడు ఆమెకు మొదటిసారిగా తన అమ్మానాన్నలంటే ద్వేషం పెరిగింది. కానీ సైకిల్‌పైనే తనను ఎందుకు స్కూలుకు పంపుతున్నారో అర్థమైన తర్వాత ఆమె

Webdunia
బుధవారం, 24 మే 2017 (07:14 IST)
సైకిల్‌లో స్కూలుకు వెళుతుంటే అబ్బాయిలు స్కర్ట్ లాగినప్పుడు, గేలి చేసినప్పుడు ఆమెకు మొదటిసారిగా తన అమ్మానాన్నలంటే ద్వేషం పెరిగింది. కానీ సైకిల్‌పైనే తనను ఎందుకు స్కూలుకు పంపుతున్నారో అర్థమైన తర్వాత ఆమె గుండె నీరైపోయింది. పేదరికం వల్లే వారు తనకు చిన్నప్పడు మంచి సౌకర్యాలను కల్పించలేకపోయారని తెలుసుకుని వారి కష్టాలను అర్థం చేసుకున్న తర్వాత ఆ ద్వేషం స్థానంలో జాలి, ప్రేమ పెరిగాయి అంటున్నారు పరిణీతి.
 
చిన్నతనంలో తల్లిదండ్రులను తాను బాగా ద్వేషించేదాన్నని పరిణీతి చోప్రా అన్నారు. ఆమె ద్వేషానికి కారణం ఉంది. దాని గురించి పరిణీతి చోప్రా మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు మాకు ఆర్థిక కష్టాలు ఉండేవి. పెద్ద బంగ్లా, కారు వంటివి ఉండేవి కాదు. నన్ను సైకిల్‌లో స్కూల్‌కి పంపించేవాళ్లు. సైకిల్‌ తొక్కుకుంటూ నేను వెళుతుంటే, అబ్బాయిలు అల్లరి పెడతారేమోనని మా నాన్నగారు ఇంకో సైకిల్‌లో నా వెనకాలే వచ్చేవారు. అయితే నాన్న రానప్పుడు అబ్బాయిలు నన్ను బాగా ఎగతాళి చేసేవారు. నా స్కర్ట్‌ని లాగడానికి ట్రై చేసేవాళ్లు. నాకు చాలా భయం వేసేది. మినీ స్కర్ట్‌ వేసుకుని, అబ్బాయిల ముందు సైకిల్‌ తొక్కడం ఇబ్బందిగా అనిపించేది. నన్ను సైకిల్‌లో పంపిస్తున్నందుకు మా అమ్మానాన్నల మీద ద్వేషం పెంచుకున్నా.పెద్దయ్యాక వాళ్ల కష్టాలను అర్థం చేసుకున్నా. ఆ ద్వేషం స్థానంలో జాలి, ప్రేమ పెరిగాయి’’ అన్నారు.
 
ఇంతకీ పరిణీతి చిన్నప్పటి ఈ సంఘటనను ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకున్నారంటే... హీరో అక్షయ్‌కుమార్‌కు మార్షల్‌ ఆర్ట్స్‌ వచ్చు. ఆడవాళ్లకు ఆత్మ రక్షణ అవసరం అంటూ ఓ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, ఫీజు లేకుండా వాళ్లకు సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఆర్ట్‌ నేర్పించే ఏర్పాటు చేశారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసి, బయటకు వెళ్లే స్టూడెంట్స్‌కి ‘సెండాఫ్‌’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిణీతి తన చిన్ననాటి అనుభవాన్ని పంచుకున్నారు. ఉచితంగా శిక్షణ ఇస్తున్న అక్షయ్‌ని అభినందించారామె. చిన్నప్పుడు తాను భయపడినట్లుగా ఎవరూ భయపడకూడదని మహిళలకు సూచించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments