Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దుపెట్టుకోవడం అంటే పెదాలు మార్చుకోవడం కాదు.. ఊపిరి మార్చుకోవడం..

సంపత్ నంది నిర్మిస్తోన్న తాజా సినిమా పేపర్ బాయ్. ఈ సినిమాలో సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా ట్రైలర్‌‌ని విడుదల చేసిం

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (18:05 IST)
సంపత్ నంది నిర్మిస్తోన్న తాజా సినిమా పేపర్ బాయ్. ఈ సినిమాలో సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా ట్రైలర్‌‌ని విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ చూసిన వారంతా పాజిటివ్‌గా రిప్లై ఇస్తున్నారు. ట్రైలర్లో వినిపించే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా వున్నాయి. 
 
ఇందులో ''ధరణి.. నేను చదివిని మొట్ట మొదటి కవిత.. ఈ మూడు అక్షరాలూ నాకు పరిచయమైంది పుస్తకాల్లో.. దగ్గరైంది అక్షరాల్లో..'' అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ప్రేమంటే ఆక్సిజన్ లాంటిది.. అది కనిపించదు కానీ బ్రతికిస్తుంది, ముద్దుపెట్టుకోవడం అంటే పెదాలు మార్చుకోవడం కాదు.. ఊపిరి మార్చుకోవడం వంటి డైలాగులు యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా వున్నాయి. 
 
ఓ పేపర్ బాయ్ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి ప్రేమించుకోవడం.. సంపన్న కుటుంబంలో వున్న అమ్మాయి కోసం ఆ పేపర్ బాయ్ తన ప్రేమను ఏం చేస్తాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ట్రైలర్‌లో వినిపించిన నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం పేపర్ బాయ్ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments