Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల ప్రేమ గీతం హే బుజ్జి బంగారం విడుదల

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (16:03 IST)
Panja Vaishnav Tej, Srilila
పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల కలిసి తొలిసారిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 'ఆదికేశవ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్. వైష్ణవ్ తేజ్‌ మొదటిసారి యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తుండటం విశేషం. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే 'సిత్తరాల సిత్రావతి' అనే పాట విడుదలైంది. విడుదల కాగానే ఈ పాట వైరల్‌గా మారింది. ఈ పాట సంగీతం, సాహిత్యం శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని ప్రశంసలు కురిపించాయి.
 
ఆ పాటలోని శ్రీలీల, పంజా వైష్ణవ్ తేజ్ డ్యాన్స్ మూమెంట్‌లు కూడా వైరల్‌గా మారి ప్రేక్షకుల మెప్పు పొందాయి. ఇప్పుడు, ఆదికేశవ చిత్రం బృందం "హే బుజ్జి బంగారం" అనే మెలోడీని విడుదల చేసింది.
 
ఈ పాట అబ్బాయి ప్రేమను తెలుపుతూ సాగింది. ముఖ్యంగా అద్భుతమైన సాహిత్యం ఈ సంవత్సరం ప్రతి రొమాంటిక్ ప్లేలిస్టులో ఈ పాటను భాగం చేసేలా ఉంది. జి.వి.ప్రకాష్ సంగీతం ఈ రొమాంటిక్ పాటకి ఓ కొత్త అనుభూతిని జోడించింది. ఈ పాటకు సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఎంతో అర్థవంతమైన, అద్భుతమైన సాహిత్యాన్ని అందించగా.. అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల ఎంతో అందంగా ఆలపించారు.
 
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదికేశవ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జోజు జార్జ్, అపర్ణా దాస్ ఈ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆదికేశవ చిత్రం నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments