Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవితో త్వరలో సినిమా చేస్తా.. ''కబాలి'' మూవీ రజనీ స్టైల్ కానే కాదు: కేఎస్ రవికుమార్

ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికెళ్లినప్పుడు.. మళ్లీ మనమిద్దరం కలిసి సినిమా చేయాలన్నారు. తప్పకుండా చేద్దామని చెప్పినట్లు కేఎస్ రవికుమార్ తెలిపారు. అన్నీ కుదిరితే మంచి చిత్రంతో తెలుగు తెల

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (17:21 IST)
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడు. రజనీకాంత్, కమల్ హాసన్ నుంచి యంగ్ హీరోల వరకు ఆయన కింద పనిచేసిన వారే. పంచ్‌లు, పాటలు, సెటిమెంట్, లవ్ స్టోరీల్లో దిట్ట అయిన కేఎస్ రవికుమార్.. 26 ఏళ్లపాటు అగ్ర దర్శకుడిగా పేరుకొట్టేశాడు. తెలుగులో చిరంజీవి, నాగార్జునలతోనూ పనిచేశారు. అధికంగా తన డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం కన్నడ నటుడు సుదీప్‌ హీరోగా కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేఎస్ రవికుమార్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సహాయ దర్శకుడిగా పదేళ్లు, దర్శకుడిగా మొత్తం 36 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పారు. వాణిజ్య హంగులతో సినిమాలను రూపొందించడమే తన స్పెషాలిటీ. ప్రయోగాల జోలికి అందుకే వెళ్లట్లేదు. ప్రస్తుతం నటనకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాను. తాజాగా ధనుష్, శివకార్తీకేయన్, విజయ్ సేతుపతి వంటి యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తున్నానని, తెలుగులో నేరుగా సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. 
 
గతంలో చిరంజీవి, నాగార్జునలతో కలిసి సినిమాలు చేశాను. తమిళ సినిమాల్లో బిజీ అయిపోవడంతో నేరు సినిమాలను చేయలేకపోయా. కానీ ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికెళ్లినప్పుడు.. మళ్లీ మనమిద్దరం కలిసి సినిమా చేయాలన్నారు. తప్పకుండా చేద్దామని చెప్పినట్లు కేఎస్ రవికుమార్ తెలిపారు. అన్నీ కుదిరితే మంచి చిత్రంతో తెలుగు తెలుగు ప్రేక్షకులను త్వరలోనే పలకరిస్తానని చెప్పుకొచ్చారు. 
 
ప్రస్తుతం కబాలి మేనియాపై కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. గతంలో పడయప్పా.. (తెలుగులో నరసింహ) వంటి హిట్ సినిమాలను రజనీకాంత్‌తో చేశాను. కబాలి రిలీజ్ అయిన వెంటనే రజనీకాంత్‌గారికి ఫోన్ చేసి మాట్లాడా. ''సర్‌ ఇది మీ శైలి సినిమా కాదు. అలాగే రంజిత్‌ సినిమా కూడా కాదు. మంచి డాన్‌ చిత్రంలో అద్భుతంగా నటించార"ని చెప్పానని కేఎస్ అన్నారు. కమల్ హాసన్‌తో త్వరలో పంచతంత్రం సీక్వెల్ తీయబోతున్నట్లు కేఎస్ వెల్లడించారు. 

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

కుర్‌కురే ప్యాకెట్ తీసుకురాలేదని భర్తకు షాకిచ్చిన భార్య.. విడాకుల కోసం దరఖాస్తు!!

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ - బలగాల మొహరింపు.. టీడీపీ - వైకాపా నేతల గృహనిర్బంధం!!

పులివర్తి నానిపై హత్యాయత్నం : పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు!!

కుర్ కురే కొనివ్వలేదని.. భర్తకు విడాకులు ఇవ్వాలనుకున్న భార్య

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments