Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్

Webdunia
సోమవారం, 23 మే 2022 (18:10 IST)
Gopichand, Rashikhanna
విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ క‌లిసి బ‌న్నీ వాసు నిర్మిస్తున్న చిత్ర‌మిది. గోపీచంద్, రాశీఖ‌న్నా జంట‌గా న‌టించారు.ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జిక్రు రాసిన టైటిల్ సాంగ్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న.. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
 
గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.
నటీనటులు:
గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments