Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ ఖాన్ సినిమాల్లో హింస ఎక్కువ.. యువతకు ఏం నేర్పుతున్నారు? పాక్ నటి ప్రశ్న

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలపై పాకిస్థాన్ నటి, గాయని రబీ పీర్జాదా తీవ్ర విమర్శలు గుప్పించింది. సల్మాన్ ఖాన్ సినిమాల్లో హింస ఎక్కువగా ఉంటుందని.. ఆయన సినిమాల ద్వారా నేరాలను ప్రోత్సహిస్తున్న

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (18:09 IST)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలపై పాకిస్థాన్ నటి, గాయని రబీ పీర్జాదా తీవ్ర విమర్శలు గుప్పించింది. సల్మాన్ ఖాన్ సినిమాల్లో హింస ఎక్కువగా ఉంటుందని.. ఆయన సినిమాల ద్వారా నేరాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించింది. అంతేగాకుండా.. బాలీవుడ్‌లో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాలోనూ క్రైమ్ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. సినిమాల ద్వారా యువతకు ఏం నేర్పుతున్నారో భారత సినీ దర్శకులు చెప్పాలని డిమాండ్ చేసింది.
 
సామాజిక అంశాలతో పాటు సందేశాన్నిచ్చే నీతికథలతో ఒకప్పుడు పాకిస్థాన్ సినీ పరిశ్రమ ఎంతో గొప్పగా ఉండేదని.. కానీ బాలీవుడ్ దాన్ని పూర్తిగా నాశనం చేసిందని పీర్జాదా తెలిపింది. కాగా ఒకప్పుడు కళకళలాడిన పాకిస్థాన్ ఫిలిమ్ ఇండస్ట్రీ.. ప్రస్తుతం వెలవెలబోతోంది. అక్కడి ప్రేక్షకులంతా బాలీవుడ్ సినిమాల వైపు దృష్టి మళ్లించారు. దీంతో ఏం చేయాలో తోచక సినీ నటులు ప్రేక్షకుల కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ బాలీవుడ్ సినీ పరిశ్రమ పాక్ ప్రేక్షకులను తనవైపు లాక్కోవడంపై  రబీ పీర్జాదా లాంటి నటులు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని సినీ పండితులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments