Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ 'పైసా వసూల్' పాటలు.. Full Audio Jukebox

హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పైసా వసూల్'. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఆడియో రిలీజ్ కార్యక్రమం గురువారం రాత్రి ఖమ్మంలో జరిగింది. ఈ వేడుకకు విచ్చేసిన నటుడు బాలకృష్ణకు

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (06:48 IST)
హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పైసా వసూల్'. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఆడియో రిలీజ్ కార్యక్రమం గురువారం రాత్రి ఖమ్మంలో జరిగింది. ఈ వేడుకకు విచ్చేసిన నటుడు బాలకృష్ణకు అభిమానుల ఘనస్వాగతం లభించింది. చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్, ఈ చిత్రంలో నటీనటులు శ్రియ, కైరాదత్, అలీ తదితరులు హాజరయ్యారు.
 
 కాగా, ఈ వేడుక సందర్భంగా  గాయనీ గాయకులు ఆలపించిన బాలకృష్ణ సినిమాలలోని పాటలు, ప్రత్యేక ప్రదర్శన ఆకట్టుకున్నాయి. కాగా, ఈ చిత్రంలోని ఐదు పాటలతో కూడిన ఆడియోను కూడా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచారు. వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా భవ్యా క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. ఇందులో 'పైసా వసూల్', 'హన్ను హన్ను హలిసాయి', 'మామా ఏక్ పెగ్ లా', 'పదామరి...', 'తేడా సింగ్..' (థీమ్ సాంగ్) అంటూ సాగే పాటలు ఉన్నాయి. ఆ పాటల ఆడియో మీ కోసం... 
 
అలాగే, ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో బాలయ్య చెప్పే డైలాగులకు నందమూరి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా, ‘మేరా నామ్ తేడా.. తేడా సింగ్.. దిమాక్ తోడా.. 36 దోపిడీలు.. 24 మర్డర్లు.. 36 స్టాపింగ్‌లు.. దిస్ ఈజ్ మై విజిబుల్ రికార్డ్ ఇన్ వికీపీడియా’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంది. 
 
అదేవిధంగా మనది నేల టికెట్ బ్యాచ్..కసి తీరకపోతే శవాన్ని లేపి మరి చంపేస్తా అంటూ చెప్పిన డైలాగ్స్ మూవీపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా శ్రియ నటిస్తున్నది. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments