Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా.. తస్మాత్ జాగ్రత్త.. నీ ముక్కు కోస్తాం : కర్ణిసేన

బాలీవుడ్ నటి దీపికా పదుకొనేకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజ్‌పూత్ కర్ణిసేన నాయకులు హెచ్చరించారు. దీపికా.. తస్మాత్ జాగ్రత్త.. నీ ముక్కుకోస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (09:42 IST)
బాలీవుడ్ నటి దీపికా పదుకొనేకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజ్‌పూత్ కర్ణిసేన నాయకులు హెచ్చరించారు. దీపికా.. తస్మాత్ జాగ్రత్త.. నీ ముక్కుకోస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీపికా ప్రధాన పాత్రధారిణిగా 'పద్మావతి' చిత్రం నిర్మితమైన విషయం తెల్సిందే. ఇందులో అనేక సన్నివేశాలను హిందువులను కించపరిచేలా ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రాజ్‌పుత్ కర్ణిసేన నాయుకులు మండిపడుతున్నారు. 
 
దీనిపై వారు స్పందిస్తూ, శూర్పణఖ ముక్కును లక్ష్మణుడు కోసినట్టు.. నీ ముక్కు కూడా కోస్తామంటూ హెచ్చరించారు. సినిమా విడుదలను ఎవరూ అడ్డుకోలేరన్న ఆమె వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్ణిసేన ఈ వ్యాఖ్యలు చేసింది. అల్లావుద్దీన్‌ ఖిల్జీతో రాణి పద్మిని ప్రేమాయణాన్ని ఈ సినిమాలో చిత్రీకరించిన తీరును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న కర్ణిసేన డిసెంబరు ఒకటో తేదీన సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించింది. 
 
సంజయ్‌ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల రోజున భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. కర్ణిసేన హెచ్చరిక నేపథ్యంలో దీపికకు ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించింది. సినిమా విడుదల రోజున రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భద్రత ఏర్పాటు చేస్తామని కర్ణాటక హోమంత్రి రామలింగా రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments