Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Paagal Teaser వైరల్.. యూట్యూబ్‌ టాప్ ట్రెండింగ్‌లో స్థానం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (18:26 IST)
Paagal Teaser
విశ్వక్ సేన్ పాగల్ చిత్రం చూస్తే పూర్తిగా గేర్ మార్చినట్లు అర్థమవుతోంది. 'పాగల్' అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. సినిమా టీజర్ రిలీజ్ చేశారు. దాదాపు నిమిషం నిడివితో కూడిన ఈ టీజర్‌లో విశ్వక్ సేన్ కాస్త కొత్తగా దర్శనమిచ్చాడు. 
 
నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతుంది. ఇటీవలే విడుదలైనా పాగల్ టీజర్ పై విశేషమైన స్పందన వచ్చింది. ఈ సినిమా విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ పాగల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ రాధన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
 
ఈ టీజర్ యూట్యూబ్ తెలుగు ట్రెండింగ్ వీడియో జాబితాలో ఉంది. పాగల్ టాప్ లో ఉడటంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకి 3.3 మిలియన్ వ్యూస్ సాధించి పాగల్ టీజర్ (Paagal Teaser) యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. 
 
ఈ టీజర్‌లో ప్రేమ కోసం పరితపించే లవర్ బాయ్ లా ఆకట్టుకున్నాడు. స్టైలిష్ యాటిట్యూడ్‌తో విశ్వక్ కనబర్చిన హావభావాలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మరోవైపు విశ్వక్ సేన్ హేయిర్ స్టైల్ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో ఉందని కొందరూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విశ్వక్ ఎన్టీఆర్ అభిమాని అంటూ మరో నెటిజన్ కామెంట్స్ పెట్టాడు. పాగల్ వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా వున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

నడి రోడ్డుపై కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి (Video)

Telangana tunnel tragedy: తెలంగాణ సొరంగంలో రెస్క్యూ పనులు.. మానవ అవశేషాల జాడలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments