Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రోనాను జయించ‌డ‌మే మనంద‌రి ధ్యేయం - నంద‌మూరి బాల‌కృష్ణ

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (17:56 IST)
కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మెసులుకొని ఈ క‌రోనాను జ‌యించాల‌ని అగ్రహీరో నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ పోరులో ప్రభుత్వాలు భాధ్యతగా పని చేయాలని అదే సమయంలో ప్రజలు కూడా అంతే భాద్యతాయుతంగా ఉండి తమను తాము పరిరక్షించుకోవాలని ఆయన సూచించారు.
 
వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే ‌వ్యాక్సిన్ 
రావాలని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఇప్పటికే ప్లాస్మా బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారని ఈ ప్లాస్మా వలన చాలామంది ప్రాణాలు కాపాడగలుగుతున్నారని వివరించారు. అలానే కరోనా పట్ల భయం వదలి కరోనాను జయించాలని విజ్ఞప్తి చేశారు. 
 
బుధవారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఓ కార్యక్రమానికి విచ్చేసిన బాలకృష్ణ విలేఖరులు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వ అనుమతి ఇప్పుడే వచ్చిందని, త్వరలోనే దీనిపై పరిశ్రమ పెద్దలందరం కూర్చొని చర్చించుకొని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామ - కోడలు ఏకాంతంగా ఉండగా చూసిన కుమార్తె... తర్వాత...

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments