Webdunia - Bharat's app for daily news and videos

Install App

RRR గే లవ్ స్టోరీ అన్న ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి!: నెటిజన్లు ఫైర్

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (10:06 IST)
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలవడమే కాకుండా భారీగా వసూళ్లు సాధించింది. అంతేగాకుండా విదేశాల్లోనూ సత్తా చాటింది. 
 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించి ఈ సినిమాపై సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు. చరణ్, తారక్ నటన.. రాజమౌళి దర్శకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కొందరి నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. 
 
తాజాగా మరోసారి ఓ నెటిజన్ చేసిన ట్వీట్‏కు రిప్లై ఇస్తూ ఆర్ఆర్ఆర్ ఏకంగా గే లవ్ స్టోరీ అనేశాడు ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి. దీంతో అతనిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
 
నిన్న రాత్రి ఆర్ఆర్ఆర్ అనే 30 నిమిషాల చెత్త సినిమాను చూశాను అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అతనికి ట్వీట్ కు బదులిస్తూ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి ఆర్ఆర్ఆర్ గే లవ్ స్టోరీ అంటూ కామెంట్ చేశారు. దీంతో రసూల్ తీరుపై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. రసూల్ పూకుట్టి ట్వీట్ పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ అసహనం వ్యక్తం చేశారు.
 
"మీరు చెప్పినట్లుగానే ఆర్ఆర్ఆర్ సినిమా గే లవ్ స్టోరీ అని నేను అనుకోను. అయితే అది గే లవ్ స్టోరీ అయితే తప్పేంటీ ? అది తప్పు విషయమా ? మీ మాటలను మీరు ఎలా సమర్ధించగలరు ? ఎన్నో విజయాలు అందుకున్న మీరు ఇలా తక్కువ స్థాయికి దిగజారి మాట్లాడటం మమ్మల్ని నిరాశకు గురిచేసింది"అంటూ రిప్లై ఇచ్చారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments