Webdunia - Bharat's app for daily news and videos

Install App

కథ వింటేనే బలంగా రాసే అవకాశం వుంటుంది : రామజోగయ్య శాస్త్రి

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (16:59 IST)
Ramajogaiah Shastri
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ''వీరసింహారెడ్డి' జనవరి 12 విడుదలౌతుండగా, మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో 'వాల్తేరు వీరయ్య'  జనవరి 13న  ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన 'వీరసింహారెడ్డి' చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు.. 'వాల్తేరు వీరయ్య' చిత్రంలోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్  పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.  'వీరసింహారెడ్డి'లో అన్ని పాటలకు (సింగిల్ కార్డ్), 'వాల్తేరు వీరయ్య'లోని  'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ' పాటకు సాహిత్యం అందించారు ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో విశేషాలని పంచుకున్నారు.
 
చిరంజీవితో  'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ' పాట రాయడం ఎలా అనిపించింది ?
ఈ లిరిక్స్ లో సౌండింగ్ సరదా అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ తో చెప్పాను. దాని చుట్టూ ఒక కాన్సెప్ట్ అనుకొని ఒక ట్యూన్ ఇచ్చారు. పాట చాలా అద్భుతంగా వచ్చింది. ట్యూన్ కు అనుగుణంగానే రాసా.. ఇందులోవి మంచి పదాలే పడ్డాయి. 
 
ఈ రెండు సినిమాల్లో యాక్టర్ గా ఎక్కడైనా మెరిశారా?
'వీరసింహారెడ్డి' మా బావ మనోభావాలు పాటలో ఓ చోట కనిపిస్తా.
 
సంక్రాంతి సినిమాలన్నిటికీ లిరిక్స్ రాశారు కదా.. ఈ సంక్రాంతి మీదే అనిపిస్తోంది ?
అనుకుంటే జరగదు. అలా కుదిరిందంతే.
 
చాలా పాటలు రాస్తూనే వుంటారు కదా.. ఎక్కడైనా రైటర్స్ బ్లాక్ ఉంటుందా ?
అలా ఏమీ వుండదు. ఇన్నాళ్ళ అనుభవంతో టెక్నిక్, అలవాటు ప్రకారం కంటెంట్ ఇవ్వడం జరిగిపోతుంది. అయితే గొప్ప పాట రావాలి, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ కావాలంటే మాత్రం కొంత సమయం పడుతుంది.
 
'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్యలో అలా నెక్స్ట్ లెవల్ కంటెంట్ అనుకునే పాటలు ఏమిటి ?
'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్యలో అన్ని పాటలు నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకంగా వుంటుంది. పెద్ద సినిమాలకి వచ్చేసరికి కావాల్సిన సమయం ఇస్తారు. పైగా అఖండ సినిమాకి రాయలేదు. ఆ పట్టుదల వుంటుంది. క్రాక్ తర్వాత గోపీచంద్ తో మళ్ళీ కలసి చేస్తున్నాను. 'వీరసింహారెడ్డి సింగిల్ కార్డ్ రాశాను. మొదటి నుండి కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత బలంగా రాసే అవకాశం వుంటుంది. తమన్  తో కలసి అన్ని పాటలు అద్భుతంగా చేశాం. విడుదలైన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నాలుగో పాట కూడా అంతకు మించి వుంటుంది.
 
సింగిల్ కార్డ్ రాస్తున్నపుడు మీ పై ఒత్తిడి ఉంటుందా ? 
సింగిల్ కార్డ్ అయినా.. ఒక్క పాట అయినా.. దర్శకుడి కల కోసమే గేయ రచయిత పని చేస్తాడు. దర్శకుడు విజన్ కి తగట్టు అడుగులు వేయడంలోనే గేయ రచయిత గొప్పదనం వుంటుంది. అయితే సింగిల్ కార్డ్ రాయడంలో ఒక సౌలభ్యం వుంటుంది. పాటలన్నీ ఒకరే రాస్తారు కాబట్టి ఏ పాటలో ఎలాంటి మాట వాడాం, ఏ భావం చెప్పాం..  ఫ్లో సరిగ్గా వుందో లేదో చెక్ చేసుకునే అవకాశం వుంటుంది. ఆరు పాటలు ఆరుగురు రాస్తే మాత్రం.. ఈ కోర్డినేషన్ పని దర్శకుడు చూసుకోవాల్సివస్తుంది.
 
పెద్ద హీరోల సినిమాలకి రాస్తున్నపుడు అభిమానుల అంచనాలు అందుకోవడం సవాల్ గా ఉంటుందా ?
ప్రతి పాటకు సవాల్ వుంటుందండీ.  ఉదాహరణకు ఒక ప్రేమ పాటే రాస్తున్నాం అనుకోండి. మనమే ఇప్పటికి బోలెడు ప్రేమ పాటలు రాసుంటాం. ఈ పాటలో ఏం కొత్తగా చెప్పాలనే ఒత్తిడి ఖచ్చితంగా వుంటుంది.  బాలయ్య గారికి ఇదివరకే కొన్ని పాటలు రాశాం. ఈ సారి ఏం కొత్తగా చెప్పాలనే ఒత్తిడి, సవాల్ వుంటుంది.
 
మా బావ మనోభావాలు ఐడియా ఎవరిది ? 
మా బావ మనోభావాలు ఐడియా నాదే. ఒకసారి తమన్ తో చెబితే దాచి పెట్టమని చెప్పాడు. తర్వాత దర్శకుడు గోపీచంద్ కి చెప్పడం, పాట చేయడం జరిగింది. మనోభావాలు అందరూ సమకాలీనంగా వాడే మాటే. 
 
మాస్ మొగుడు పాట గురించి ?
మాస్ మొగుడు పాట మంచి ఊపుతో వుంటుంది. క్లైమాక్స్ కి తగ్గట్టుగా వుంటుంది.
 
 'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్య సినిమాలు ఎలా వుండబోతున్నాయి ?
'వీరసింహారెడ్డి', వాల్తేరు వీరయ్య రెండూ సినిమాలు ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ తో పాటు మంచి మ్యూజికల్ ట్రీట్ ఇస్తాయి. ఈ రెండు చిత్రాలు బూమ్ బద్దలు రికార్డ్ లు సృష్టిస్తాయి.
 
బాలకృష్ణ, చిరంజీవి గారి పాటలు రాస్తున్నపుడు ప్రత్యేకంగా ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు ? వాళ్ళ నుండి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్స్ ? 
బాలకృష్ణ, చిరంజీవి గారి ఇమేజ్ పాట రాయడానికి ఒక ఊతమిస్తుంది. కొన్ని మాటలు వాళ్ళ ఇమేజ్ కే రాయగలం. చిరంజీవి గారికి రాసిన పాట విని చాలా బావుందని అన్నారు. అలాగే మనోభావాలు పాట షూటింగ్ జరిగినప్పుడు సెట్ కి వెళ్లాను. బాలకృష్ణ గారు కూడా బావుందని అభినందించారు. మనోభావాలు పాట విజువల్ గా కూడా చాలా కిక్ ఇచ్చింది.
 
ట్యూన్ కి లిరిక్స్ రాస్తారా ? లిరిక్స్ కి  ట్యూన్ చేస్తారా ?
సంగీత దర్శకుడికి, లిరిక్ రైటర్ కి కేంద్ర బిందువు దర్శకుడు. ఆయన కథ, సందర్భం, విజన్ కి తగ్గట్టు పని చేయాల్సి వుంటుంది. ఎక్కవ సమయాల్లో ట్యూన్ కె లిరిక్స్ రాస్తాను.
 
యువ గేయ రచయితలకు మీరు ఇచ్చే సలహా ?
మనలో ఆసక్తి, పాటకు రాసే లక్షణం వుందో లేదో చూసుకోవాలి. కొందరు చాలా మంచి కవిత్వం రాసే ప్రతిభ కలిగివుంటారు. కానీ ఇక్కడ ట్యూన్ కి రాయడం ప్రధానం. అలాగే కొన్ని సార్లు ట్యూన్ లేకుండా కూడా రాయాలి. ఎంతగొప్పగా రాసినా సింపుల్ గా రాయడం ఇక్కడ ప్రధానం. బాగా చదవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఓర్పు, పట్టుదల సహనం వుండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

బీఆర్ఎస్ బాగా రిచ్ గురూ.. ఆ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు.. వామ్మో! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments