Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్-రానా కాంబినేషన్‌లో మల్టీస్టారర్.. దర్శకుడు ఎవరంటే?

టాలీవుడ్‌లో ఓ వైపు బయోపిక్‌లు.. మరోవైపు మల్టీస్టారర్ మూవీలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్-రామ్ చరణ్, వెంకటేష్-వరుణ్ తేజ్, నాగార్జున-నాని కాంబోలో మల్టీస్టారర్ సినిమాలు రూపుదిద్దుకోనున్నాయి.

Webdunia
బుధవారం, 4 జులై 2018 (17:32 IST)
టాలీవుడ్‌లో ఓ వైపు బయోపిక్‌లు.. మరోవైపు మల్టీస్టారర్ మూవీలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్-రామ్ చరణ్, వెంకటేష్-వరుణ్ తేజ్, నాగార్జున-నాని కాంబోలో మల్టీస్టారర్ సినిమాలు రూపుదిద్దుకోనున్నాయి. 
 
తాజాగా బాహుబలిలో నాయకుడు, ప్రతినాయకుడిగా కనిపించి ప్రపంచ  వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రభాస్, రానా ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ సినిమాలో కలిసి నటించబోతున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల పేర్లు వినగానే దర్శకుడు దశరథ్ పేరు గుర్తుకు వస్తుంది. లవ్, ఫ్యామిలీ డ్రామాతో కూడిన సూపర్ కథతో సినిమాలను రూపొందించడంలో అతడు దిట్ట. 
 
అలాంటి సూపర్ దర్శకుడు కొత్తగా ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడని, ఆ సినిమాలో ప్రభాస్, రానా కలిసి నటిస్తారని తెలుస్తోంది. ఇందుకోసం రానా, ప్రభాస్‌‍లను దశరథ్ కలిసేందుకు సిద్ధంగా వున్నట్లు సమాచారం. మరి ఈ కాంబోలో సినిమా పట్టాలెక్కుతుందో లేదో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments