Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్‌తో రాజమౌళి సినిమా: పొంగిపోతున్న అభిమానులు

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌తో రాజమౌళి సినిమా తీయబోతున్నారన్న వార్త రజనీ అభిమానుల్లో సుడిగాలిలా వ్యాపించిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులు ఈ వార్త వెలువడగానే పట్టరాని సంతోషంతో హర్షం ప్రకటిస్తున్నారని సమాచారం.

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (09:53 IST)
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌తో రాజమౌళి సినిమా తీయబోతున్నారన్న వార్త  రజనీ అభిమానుల్లో సుడిగాలిలా వ్యాపించిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులు ఈ వార్త వెలువడగానే పట్టరాని సంతోషంతో హర్షం ప్రకటిస్తున్నారని సమాచారం. ‘బాహుబలి ద కంక్లూజన్’ తమిళ ఆడియో విడుదల సందర్భంగా చెన్నై వెళ్లిన చిత్ర బృందం చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో పాల్గొంది. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడారు. అలా మాట్లాడుతూ ‘‘సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ఏదో ఒకరోజు సినిమా తీస్తా’’ అని తన మనసులో మాట బయటపెట్టారు. ఆదివారం రాత్రి ఈ ఒక్కమాట తమిళనాడులో పెను సంచలనమే సృష్టించింది.
 
బాహుబలి ది బిగినింగ్ సినిమా తమిళ సీనీ వర్గాల్లో సృష్టించిన కలకలం ఇంతా అంతా కాదు. ఒక పట్టాన ఇతర భాషా చిత్రాల ఆధిక్యతను, నాణ్యతను ఒప్పుకోవడానికి అంగీకరించని తమిళ ప్రజలు, సినీ వర్గాలు బాహుబలి తొలి భాగాన్ని చూడగానే మతులు పోగొట్టుకున్నారు. బాహుబలి పార్ట్-1 విడుదలై మంచి హిట్ టాక్ వచ్చినప్పటి నుంచి బాలీవుడ్, కోలీవుడ్ నటులతో రాజమౌళి సినిమా చేయబోతున్నారని అనేక వార్తలు, ఊహాగానాలు వచ్చాయి. 
 
అప్పట్లోనే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌కు కాల్ చేసిన రజనీకాంత్ తనకు మంచి కథను ఇవ్వవలసిందిగా కోరినట్లు వార్తలొచ్చాయి. ఇక రాజమౌళి స్వయంగా రజనీకాంత్‌తో సినిమా తీయాలని ఉందన్న కోరికను ప్రకటించడంతో రజనీ అభిమానులు వెర్రెత్తిపోతున్నారని వార్తలు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments