Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Thalaivi జయలలిత 72వ జయంతి: కంగనా లుక్ అదుర్స్

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (11:53 IST)
Jayalalithaa
తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 24వ తేదీన జయలలిత 72వ జయంతిని పురస్కరించుకుని.. ఈ సినిమా నుంచి మరో లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తలైవి ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. 
 
‘తలైవి’లో హిందీ నటి కంగనా రనౌత్‌ జయలలిత పాత్రలో అలరించనుండగా.. ఎమ్‌జీఆర్‌గా అరవింద స్వామి నటిస్తున్నాడు. శోభన్ బాబు పాత్రలో బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా నటించనున్నాడు. జిషు సేన్ గుప్తా తాజాగా తెలుగులో విడుదలైన 'అశ్వత్థామ'లో విలన్‌గా అదరగొట్టాడు. 
 
ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జయలలిత ఎలా టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.. ఆ తర్వాత తమిళ రాజకీయాల్లో శక్తిమంతమైన నాయకురాలిగా.. మారిన విషయాలు చర్చించనున్నారు. ఇకపోతే.. ఈ సినిమాలో కంగన పాత్రకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన రెండు లుక్స్‌కు మంచి ఆదరణ లభించింది. తాజాగా విడుదలైన లుక్‌లో యువ రాజకీయ నాయకురాలిగా జయలలిత అలరిస్తోంది. ఈ లుక్‌లో కంగన జయలలిత రూపంలో ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments