Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘ఒక్క అమ్మాయి తప్ప’ సెన్సార్ పూర్తి... జూన్ 10న విడుదల

Webdunia
మంగళవారం, 31 మే 2016 (18:53 IST)
ప్ర‌స్థానం' వంటి డిఫ‌రెంట్ మూవీతో సినిమా రంగానికి ప‌రిచ‌య‌మైన సందీప్‌ కిష‌న్‌ హీరోగా నటించిన  చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. కథా బలం ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విలక్షణమైన నటి నిత్యామీనన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేసిన రాజసింహ తాడినాడ దర్శకత్వంలో మంచి అభిరుచి గల నిర్మాతగా, ఎగ్జిబిటర్‌గా పేరు తెచ్చుకున్న బోగాది అంజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని, U సర్టిఫికేట్ సంపాదించుకుంది. ‘ఒక్క అమ్మాయి తప్ప’ జూన్ 10 న భారీ స్థాయి లో విడుదల అవుతుంది. 
 
నిర్మాత బోగాది అంజిరెడ్డి మాట్లాడుతూ " సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మా చిత్రానికి U సర్టిఫికేట్ వచ్చింది. సందీప్‌ కిష‌న్‌ కెరీర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ అవ్వబోతున్న ఈ చిత్రం అయన కు  ఒక మైలు రాయి వంటిది. ఇటీవలే విడుదల అయిన ఆడియో ఆల్బం ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు . మా సినిమా ట్రైలర్ కు యూ ట్యూబ్ లో 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ", అని ఆయన అన్నారు. 
 
దర్శకుడు రాజసింహ మాట్లాడుతూ ‘’నేను జయంత్ గారి వద్ద, అలాగే పరుచూరి బ్రదర్స్ దగ్గర అసోసియేట్ రైటర్‌గా వర్క్ చేశాను. ఇండిపెండెంట్ రైటర్ గా కూడా 15 సినిమాలకు పనిచేశాను. 2007లో ఈ సినిమా కథను రాసుకున్నాను. రెండు, మూడు సార్లు స్టార్ట్ అయ్యి కొన్ని కారణాలతో ఆగిపోయిన సినిమా. ఈ కథను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావని చాలా మంది అడిగారు, నాతో పాటు నన్ను, నా కథను నమ్మారు. ఛోటా కె.నాయుడుగారు ఈ ప్రాజెక్ట్ ను టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత సినిమా ట్రాక్ ఎక్కింది. బోగాది అంజిరెడ్డి వంటి నిర్మాతగారు ముందుకు వచ్చారు. 
 
ఈ సినిమాలో ఒక గంట పాటు సీజీ వర్క్ ఉంటుంది. కానీ అది తెలియదు. ఈ సినిమా కథలో ఎక్కువ భాగం హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై జరుగుతుది. అక్కడా షూటింగ్ కుదరదు కాబట్టి అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి మిగతాదంతా గ్రాఫిక్స్‌లో క్రియేట్ చేశాం. నిత్యాగారు నాలుగు గంటల పాటు కథ విని ఒప్పుకున్నారు. అద్భుతంగా సపోర్ట్ చేశారు. అలాగే సందీప్ నన్ను నమ్మి సపోర్ట్ చేశారు. నిర్మాత అంజిరెడ్డిగారికి థాంక్స్. ఒక్క అమ్మాయితప్ప అందరినీ నవ్విస్తుంది, ఎంటర్ టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది’’ అన్నారు.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments