Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెబ్బా పటేల్ స‌హ‌జ గెట‌ప్‌తో ఓదెల రైల్వేస్టేషన్‌

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (19:37 IST)
Hebba Patel, Vashishta Simha, KK Radha Mohan
దర్శకుడు సంపత్‌ నంది అందించిన కథ, స్క్రీన్ ప్లేతో హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ  ప్రధాన పాత్రల్లో అశోక్‌ తేజ్‌ దర్శకత్వంలో కె.కె.రాధా మోహన్‌ నిర్మించిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్‌’. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 26న 'ఆహా' వేదికగా విడుదలౌతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలని పంచుకుంది.
 
వశిష్ట సింహ మాట్లాడుతూ.. ‘ఓదెల రైల్వేస్టేషన్‌' చాలా మంచి కథ. నాకు చాలా ఇష్టమైన సినిమా. కరోనా సెకండ్ వేవ్ సమయంలో అందరికీ సేఫ్టి ఇచ్చి ఇంత చక్కటి సినిమా తీసిన రాధా మోహన్‌ గారికి అభినందనలు. ఈ సినిమా కథని విన్నపుడు చాలా థ్రిల్ అయ్యాను. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా వుంటుంది. ఈ సినిమాతో సంపత్ నంది, హెబ్బా పటేల్, సాయి రోనక్ .. ఇలా అందరూ మంచి ఫ్రండ్స్ అయ్యారు. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా. ఈ చిత్రంలో ప్రతి పాత్ర ఆకట్టుకుంటుంది. .‘ఓదెల రైల్వేస్టేషన్‌' ఆహాలో వస్తుంది. తప్పకుండా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.
 
హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. ఒరేయ్ బుజ్జిగాలో క్యామియో రోల్ చేశాను. అప్పుడే నిర్మాత రాధా మోహన్‌ గారు నాతో ఒక సినిమా చేస్తానని మాటిచ్చారు. అయితే ఇండస్ట్రీలో ఇలాంటి మాటలు చాలా వింటాం. లాక్ డౌన్ లో ఫోన్ చేసి ‘ఓదెల రైల్వేస్టేషన్‌ గురించి చెప్పారు. చాలా సర్ప్రైజ్ అయ్యా. మాటని నిలబెట్టుకునే మనుషులు చాలా తక్కువగా వుంటారు. ఈ విషయంలో రాధా మోహన్‌ గారికి చాలా థాంక్స్. సంపత్‌ నంది గారు ఈ కథ చెప్పినపుడు చాలా సర్ ప్రైజ్ ఫీలయ్యా. ఇలాంటి పాత్రని నేను ఎప్పుడూ చేయలేదు. అసలు నేను చేయగలనా ? అనే అనుమానం కూడా వచ్చింది. ఐతే సంపత్ గారు ఒకసారి ప్రయత్నించమని చెప్పారు. నా కెరీర్ లో చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ కష్టాన్ని చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో నా పాత్ర ఒక సవాల్ తో కూడుకున్నది. ఒక నటిగా ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను. వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ లాంటి మంచి టీంతో కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.
 
నిర్మాత కె.కె.రాధా మోహన్‌ మాట్లాడుతూ.. ‘ఓదెల రైల్వేస్టేషన్‌' క్రైమ్ థ్రిల్లర్.  దర్శకుడు సంపత్‌ నంది కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఏమైయింది ఈవేళ నుండి సంతప్ నంది గారితో పరిచయం వుంది. డీ వోపీ సౌందర్ రాజన్, మ్యూజిక్ అనూప్ రూబెన్స్ ఇలా చాలా అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేశారు. వశిష్ట ఇందులో అవుట్ అఫ్ ది బాక్స్ పాత్ర చేశారు. హెబ్బా పటేల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేసింది. సాయి రోనక్, పూజిత పొన్నాడ మిగతా వాళ్ళు అందరూ  కూడా చక్కగా నటించారు. 50 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేశాం. కోవిడ్ సెకండ్ వేవ్ వలన రిలీజ్ కొంచెం ఆలస్యం అయ్యింది. ఈ సినిమాని విడుదల చేయడానికి ఆహా ఒక వేదికని ఇచ్చింది. గతంలో ఆహాలో విడుదలైన ఒరేయ్ బుజ్జిగా అందరినీ అలరించింది. ఈ చిత్రం కూడా ఆహాలో మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నాను'' అన్నారు
 
దర్శకుడు అశోక్‌ తేజ్‌ మాట్లాడుతూ.. కథ, మాటలు ఇచ్చిన సంపత్ నంది గారికి, నన్ను దర్శకుడిని చేసిన రాధా మోహన్‌ గారికి జీవితాంతం రుణపడివుంటాను. హెబ్బా పటేల్, వశిష్ట సింహ,సాయి రోనక్, పూజిత పొన్నాడ.. చాలా అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. అందరికి చాలా మంచి పేరు వస్తుంది. ఈ చిత్రం కోసం పని చేసిన అందరికీ థాంక్స్. ఆహాకు ప్రత్యేక కృతజ్ఞతలు'' తెలిపారు.
 
సాయి రోనక్ మాట్లాడుతూ.. ఇంతకుముందు కొన్ని సాఫ్ట్ పాత్రలు చేశాను, కానీ ఇందులో చాలా సీరియస్ కాప్  రోల్ చేశా. నన్ను ఆ పాత్ర కోసం నమ్మిన డైరెక్టర్ గారికి చాలా థాంక్స్. ఈ సినిమా షూట్ చాలా సహజంగా చేశాం. హెబ్బా చాలా కష్టపడి చేసింది. వశిష్ట ఈ సినిమాతో నాకు ఎంతో దగ్గరయ్యారు. ఆహాలో ఈ సినిమా విడుదల కావడం ఆనందంగా వుంది'' అన్నారు
 
ఆహా శ్రీనివాస్ మాట్లాడుతూ..  ఓదెల రైల్వేస్టేషన్‌ సినిమా చుసిన తర్వాత అసలు ఓదెల రైల్వేస్టేషన్‌ ఉందా? అని గూగుల్ చేశాను. సినిమా చూశాకా మీరు కూడా గూగుల్ చేస్తారు. ఒరేయ్ బుజ్జిగా ఆహాలో ఎంత విజయం సాధించిందో ఈ సినిమా కూడా అంత పెద్ద విజయం సాధించాలి'' అని కోరుకున్నారు.
 
తారాగణం:హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ, గగన్ విహారి, నాగ మహేష్, సురేందర్ రెడ్డి, హారిక, ప్రవణ్య రెడ్డి, దివ్య, నవీన్,
టెక్నికల్ టీమ్-,  క్రియేటర్ – సంపత్ నంది నిర్మాత - కెకె రాధా మోహన్దర్శకత్వం - అశోక్ తేజ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments