Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని సినిమా ప్ర‌మోష‌న్‌కూ అడ్డంకులు ఎదుర‌వుతున్నాయ్‌!

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (12:35 IST)
Tuck jagadesh
నాని కథానాయకుడిగా నటించిన కుటుంబ కథా చిత్రం ‘టక్‌ జగదీష్‌’. శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమాలో ట‌క్ చేసుకోవ‌డంపైనే క‌థ మొద‌ల‌వుతుంది. యాక్ష‌న్ సీన్‌లోకూడా ట‌క్ ఊడ‌కుండా చిత‌కొడ‌తాడు. ఇలా ట‌క్ చేసుకోవ‌డం ప్ర‌తి మ‌నిషిలో క‌లుగుతుంది. నేను బాగున్నానా! లేదా! అన్న‌ట్లుగా ఫీల్ క‌లుగుతుంది. కొత్త‌గా ట‌క్ చేసుకోనివాడికి కొత్త‌గా అనిపించేట్లుగా త‌న‌కూ అనిపించిందని నాని చెప్పాడు. అయితే క‌రోనా వ‌ల్ల సినిమా విడుద‌ల వాయిదావేశారు. కానీ ఎట్టిప‌రిస్తితుల్లోనూ థియేట‌ర్‌లో విడుద‌ల చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు నాని. కానీ నాని రూట్ మార్చాడు. త‌న మాట‌లు వెన‌క్కుతీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించాడు. అందుకే సెప్టెంబర్‌ 10న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ‘టక్‌ జగదీష్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది
 
అయితే ఈ సినిమా విడుద‌ల‌లో ఎటువంటి అడ్డంక‌లు వ‌చ్చాయో ఇప్పుడు అమెజాన్ సంస్థ ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డానికి గ‌త వారంరోజులుగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే వుంది. కానీ ఎక్క‌డా స‌రైన వేదిక దొర‌క్క‌పోవ‌డం విశేషం. ముందుగా ఫిలింసిటీలో గ్రాండ్ గా మ‌రోసారి ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డానికి నిర్ణ‌యించారు. అందుకు ఆహ్వ‌నాలుకూడా అంద‌రికీ వెళ్ళాయి. కానీ త‌ర్వాత రోజు వారికి ఫిలింసిటీలో శ్లాట్ దొర‌కలేదని మెసేజ్ వ‌చ్చింది. దాంతో హైద‌రాబాద్ సిటీలో ప‌లు స్టార్ హోట‌ల్ల‌లో నిర్వ‌హించ‌డానికి ప్ర‌య‌త్నించారు. కానీ ఏ హోట‌ల్ ఖాళీగా లేవ‌ని తెలిసి నిర్వాహ‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఎందుకంటే సెప్టెంబ‌ర్ 1న సెంటిమెంట్‌గా అమెజాన్ కార్య‌క్ర‌మం చేయాల‌ని త‌ల‌పెట్టింది. కానీ ఆరోజు ఎక్కువ‌గా శుభ‌కార్యాలు జ‌ర‌గ‌డం వ‌ల్ల ఖాళీలేక‌పోవ‌డం విశేషం. దాంతో ఓ రెండు గంట‌ల‌పాటు మాదాపూర్‌లోని ఓ హోట‌ల్ లో ఖాలీ దొర‌క‌డంతో ఆ టైంలో పెట్టాల‌ని డిసైడ్ అయ్యారు. సో.. క‌రోనా ముందు క‌రోనా త‌ర్వాత కూడా ట‌క్‌జ‌గ‌దీష్‌కు అడ్డంకులే. మ‌రి అమెజాన్‌లో విడుద‌ల‌య్యాక ఏమేర‌కు ఆద‌ర‌ణ వుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments