Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృత్యుముఖంలో ఉన్న అభిమానికి.. వీడియో కాల్ చేసిన హీరో! (Video)

ఠాగూర్
శనివారం, 14 సెప్టెంబరు 2024 (19:23 IST)
మృత్యుముఖంలో ఉన్న అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేసింది. ప్రాణాంతక కేన్సర్ వ్యాధితో కౌశిక్ అనే యువకుడు గత కొన్నేళ్లుగా బాధపడుతున్నాడు. ఈ యువకుడు హీరో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కూడా. దీంతో ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం చూసి చనిపోవాలని వుందంటూ తాజాగా వ్యాఖ్యానించాడు. ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్‌ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ వీరాభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి చలించిపోయారు. 
 
కౌశిక్ వయసు 19 ఏళ్లే. కానీ విధి అతడి జీవితాన్ని తారుమారు చేసింది. కొంతకాలంగా అతడు బోన్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. ఇటీవల ఆ కుర్రాడి తల్లిదండ్రులు తిరుపతిలో మీడియా ముందుకు వచ్చి, తమ కుమారుడి చివరి కోరిక ఏంటో చెప్పారు. చనిపోయేలాగా ఎన్టీఆర్ "దేవర" సినిమా చూడాలన్నదే తమ కుమారుడి ఆఖరి కోరిక అని, 'దేవర' సినిమా చూసేంతవరకైనా తనను బతికించాలని తమ కుమారుడు డాక్టర్లను వేడుకుంటున్నాడని చెప్పి ఆ తల్లిదండ్రులు భోరున విలపించారు.
 
కాగా, తన అభిమాని పరిస్థితి తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వెంటనే స్పందించారు. తాజాగా కౌశిక్‌కు వీడియో కాల్ చేసి అతడిని సంతోష సాగరంలో ముంచెత్తారు. నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి... నవ్వుతుంటే చక్కగా ఉన్నావు అని ఎన్టీఆర్ తన అభిమాని కౌశిక్‌లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించారు.
 
మీతో మాట్లాడుతానని అసలు అనుకోలేదు అని కౌశిక్ చెప్పగా... భలేవాడివే, అభిమానులతో మాట్లాడకుండా ఎలా ఉంటాను? అని ఎన్టీఆర్ బదులిచ్చారు. ఎలా ఉన్నావంటూ కౌశిక్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్‌ను జయించి రావాలని పేర్కొన్నారు. సినిమా సంగతి తర్వాత... ముందు నీ ఆరోగ్యం బాగుపడాలి... మీ అమ్మానాన్నలను చూసుకోవాలి అని ఆకాంక్షించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments