Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌కు షోకాజ్ నోటీసులు..?

నందమూరి హీరో, జూనియర్‌ ఎన్టీఆర్‌కు కొత్త కష్టమొచ్చిపడింది. నాన్నకు ప్రేమతో సినిమాకు సేవా పన్ను మినహాయింపుపై ‘కాగ్‌’ ఆక్షేపించింది. విదేశాల్లో సినిమా షూటింగ్‌ తీశామని.. అది సేవల ఎగుమతి కిందకి వస్తుందని

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2017 (10:36 IST)
నందమూరి హీరో, జూనియర్‌ ఎన్టీఆర్‌కు కొత్త కష్టమొచ్చిపడింది. నాన్నకు ప్రేమతో సినిమాకు సేవా పన్ను మినహాయింపుపై ‘కాగ్‌’ ఆక్షేపించింది. విదేశాల్లో సినిమా షూటింగ్‌ తీశామని.. అది సేవల ఎగుమతి కిందకి వస్తుందని జూనియర్ ఎన్టీఆర్ పన్ను చెల్లించకపోవడం సరికాదని కాగ్ పేర్కొంది. వినోద రంగంలో సేవా పన్నుల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై కాగ్‌ అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ పార్లమెంట్‌ ప్రవేశపెట్టారు. 
 
బాలీవుడ్‌లోనూ ఇదే తరహాలో.. ''ఏ దిల్‌ హై ముష్కిల్‌" హిందీ సినిమాను న్యూయార్క్‌లో చిత్రీకరించామని చూపిస్తూ ఆ సినిమా హీరో రూ. 83.43 లక్షల పన్ను మినహాంపులు పొందిన విషయాన్ని కాగ్‌ గుర్తించింది. అలాగే నాన్నకు ప్రేమతో సినిమాలో హీరోగా నటించిన ఎన్టీఆర్.. లండన్‌కు చెందిన వైబ్రంట్ విజువల్ లిమిటెడ్ ప్రొడ్యూసింగ్ కంపెనీ నుంచి ఏడు కోట్ల వరకు పారితోషికం తీసుకోగా, ఎక్స్‌పోర్ట్‌ ఆఫ్‌ సర్వీసు కింద పరిగణించి తాను చెల్లించాల్సిన రూ. 1.10 కోట్ల సర్వీసు పన్ను మినహాయించారని వివరించింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ కోరగా.. జూనియర్‌ ఎన్టీఆర్‌కు షోకాజ్‌ నోటీసు ఇవ్వబోతున్నామని ఆర్థిక శాఖ అనుబంధంగా ఉండే రెవెన్యూ విభాగం సమాధానం ఇచ్చింది.

ముళ్లపందిని వేటాడబోయే మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

గృహనిర్భంధంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు

41 మందులపై ధరలను తగ్గించిన ప్రభుత్వం

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments