Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దాన వీర శూర కర్ణ' @ 40 ఇయర్స్... 43 రోజుల్లో షూటింగ్... రూ.10 లక్షలు ఖర్చు

విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన 'దాన వీర శూర కర్ణ' చిత్రం విడుదలై మంగళవారానికి 40 యేళ్లు. 1977లో వచ్చిన ఈ చిత్రంలో కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్ తన నట విశ్

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (10:46 IST)
విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన 'దాన వీర శూర కర్ణ' చిత్రం విడుదలై మంగళవారానికి 40 యేళ్లు. 1977లో వచ్చిన ఈ చిత్రంలో కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం ప్రదర్శించారు. కేవలం 43వ రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేశారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి పెండ్యాల సంగీత బాణీలు సమకూర్చగా, ఈ చిత్రంలో అర్జునుడిగా హరికృష్ణ, అభిమన్యుడిగా బాలకృష్ణ నటించారు. ఈ చిత్ర నిర్మాణం కోసం కేవలం పది లక్షల రూపాయలను మాత్రమే ఖర్చు చేయగా, ఇది ఆరోజుల్లో కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత 1964లో మరోమారు విడుదలై రూ.64 లక్షల వరకు వసూలు చేసింది. ఇందులో పది పాటలు, 35 పద్యాలు ఉన్నాయి 
 
ఈ సందర్భంగా ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ స్పందిస్తూ... దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులను ఏ ఒక్కరూ మరచిపోలేరన్నారు. ఆ రోజుల్లో దాన వీర శూర కర్ణ రికార్డులు నెలకొల్పిందని, ఆ చిత్రం ఓ చరిత్ర అని చెప్పుకొచ్చారు. అలాగే తాను తన 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో నటించడం భగవంతుడి లీలగా భావిస్తానని, ఈ సినిమాకు అన్ని అంశాలు కలిసి వచ్చాయని, తనకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు క్రిష్‌లో తాను ఓ తపన, ఆవేశం, అన్వేషణ చూశానని, క్రిష్ కళ్లలో ఆ తపన కనిపించిందని, దర్శకుడు క్రిష్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని, శాతకర్ణి విజయం తెలుగువారి విజయమని వెల్లడించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments