Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ రిలీజ్ సంక్రాంతికి కూడా డౌటే? ఉగాదికి వస్తోన్న RRR

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (15:29 IST)
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పైగా ఈ సినిమా గురించి ఏవైనా అప్ డేట్స్ వస్తే చాలు క్షణాల్లో వైరల్ అవుతుంది.
 
భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు భారీ అంచనాలే వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా వీరి లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా కోవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడింది.
 
దీంతో తిరిగి షూటింగులు జరుగుతుండగా.. ఈ సినిమా కూడా మిగిలిన భాగం షూటింగ్ లో బాగా బిజీ గా ఉంది. ఇక ఈ సినిమాను గతంలో అక్టోబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అధికారిక ప్రకటన కూడా చేశారు. 
 
కానీ సెకండ్ వేవ్‌తో మళ్లీ ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల కావడం డౌటే అని దర్శకుడు రాజమౌళి అనుకోగా సంక్రాంతి కైనా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో విడుదలయ్యే సినిమాలకు తమ సినిమా వల్ల డిస్టర్బ్ కావద్దని ఫిక్స్ అయ్యాడు రాజమౌళి.
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాను మళ్లీ వాయిదా వేయడం తప్ప మరో ఆలోచన లేదని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని అనుకోగా.. తాజాగా ఈ సినిమాను ఉగాదికి విడుదల చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. 
 
అంతేకాకుండా త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సారి ఉగాదికి ఈ సినిమా వచ్చినట్లయితే తెలుగు ప్రేక్షకులకు అసలైన పండగ ఆర్ఆర్ఆర్ అనే చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments