Webdunia - Bharat's app for daily news and videos

Install App

నార్త్‌లో సల్మాన్... సౌత్‌లో ఎన్‌టీఆర్

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (12:08 IST)
యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ అటు సినిమాల్లోనే కాకుండా ఇటు చాలా సంస్థలకు అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తూ సంపాదనలో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఎన్‌టీఆర్ పలు మొబైల్ సంస్థలు, ఇతర ఉత్పత్తుల ప్రచార ప్రకటనల్లో కనిపించాడు. తాజాగా మరో కొన్ని సంస్థలు ఎన్‌టీఆర్‌ను ప్రచారకర్తగా నియమించుకున్నాయి.
 
ఎన్‌టీఆర్ ఇదివరకు మలబార్ గోల్డ్, సెలెక్ట్ మొబైల్స్, నవరత్న ఆయిల్, బోరోప్లస్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించారు. తాజాగా పార్లే ఆగ్రో కంపెనీకి చెందిన ప్రముఖ ఉత్పత్తి యాపీ ఫిజ్‌కు సౌత్ ఇండియా అంబాసిడర్‌గా ఎన్‍టీఆర్‌ను ఎంచుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో యాపీ ఫిజ్ వాణిజ్య ప్రకటనల్లో పూర్తిగా ఎన్‌టీఆరే కనిపించబోతున్నారన్నమాట. 
 
అయితే ఈ ఉత్పత్తికి నార్త్ ఇండియా అంబాసిడర్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. ఇకపోతే సల్మాన్ ఖాన్ హిందీ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించగా తెలుగులో ఎన్‌టీఆర్ హోస్ట్‌గా ఉన్నారు. ఈ విధంగా సల్మాన్ ఖాన్‌కు వస్తున్న ఆఫర్లే ఎన్‌టీఆర్‌కు కూడా వస్తుండటం చూస్తే ఎన్‌టీఆర్ క్రేజ్ అర్థం అవుతోంది. భవిష్యత్తులో ఎన్‌టీఆర్ సల్మాన్‌ను మించిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments