మరోసారి అభిమానులకు క్షమాపణలు చెప్పిన ఎన్.టి.ఆర్.

డీవీ
గురువారం, 3 అక్టోబరు 2024 (17:50 IST)
NTR
దేవర సునామి సృష్టించి, బాక్స్ ఆఫీస్ వద్ద అపూర్వమైన రికార్డులను నెలకొల్పడంలో భాగస్వామ్యమైన మీలో ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్.టి.ఆర్. తరఫున నిర్మాత నాగవంశీ ఓ పోస్ట్ పెట్టాడు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేకపోయినందున, తారక్ అన్న తెలుగు రాష్ట్రాల్లోని తన అభిమానులతో దేవర విజయాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఒక ఈవెంట్‌ను నిర్వహించాలని మొండిగా ఉన్నాడు.
 
మేము ఎడతెగని ప్రయత్నాలు చేసినప్పటికీ, దసరా,  దేవీ నవరాత్రి ఉత్సవాల కారణంగా, మా భారీ విజయోత్సవ వేడుకల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వేదికలకు అనుమతులు పొందలేకపోయాము. ఈ పరిస్థితి మా నియంత్రణలో లేదు. ఈ ఈవెంట్‌ను నిర్వహించలేకపోయి నందుకు అభిమానులందరికీ, మా ప్రేక్షకులకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. అయినప్పటికీ, మేము ఇంకా ప్రయత్నిస్తున్నాము.  తారక్ అన్నను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే శక్తిగా మీరు అర్థం చేసుకుని, కొనసాగుతారని ఆశిస్తున్నాము అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Karur stampede: వాలంటీర్ ఫోర్స్‌ను బరిలోకి దించనున్న టీవీకే చీఫ్ విజయ్

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తాం.. చంద్రబాబు

కాకినాడలో లారీని ఓవర్ టేక్ చేయబోయి.. లారీ కింద పడ్డాడు.. ఆ తర్వాత ఏం జరిగింది? (video)

నేనూ భారతీయుడినే.. అమెరికాలోని అట్లాంటాలో ఉంటున్నా... పెళ్లి పేరుతో మహిళకు రూ.2.5 కోట్ల కుచ్చుటోపీ

రాగిసంగటిలో బొద్దింక ... ఉలిక్కిపడిన హైదరాబాద్ ఆహార ప్రియులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments