Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్టీఆర్ మహానాయకుడు' రిలీజ్ డేట్ ఫిక్సయింది...

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (13:51 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్రను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో తొలిభాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు'. ఈ చిత్రం సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండోభాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు'. ఈ చిత్రం వచ్చే నెల ఏడో తేదీన విడుదల చేయాలని తొలుత చిత్ర యూనిట్ భావించింది. కానీ, చిత్రం విడుదల వాయిదాపడింది.
 
ఎన్టీఆర్ పాత్రలో హీరో బాలకృష్ణ నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తే జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తొలి భాగంలో ఎన్టీఆర్ సినీ కెరీర్‌ను చూపించారు. రెండో భాగంలో రాజకీయ నేపథ్యాన్ని చూపించనున్నారు. 
 
ఈ రెండో భాగాన్ని వచ్చే నెల 7వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాలరీత్యా దీన్ని వాయిదా వేశారు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ఈ సినిమాకు ఫిబ్రవరి 14వ తేదీన 'మహానాయకుడు'ని విడుదల చేయాలని నిర్ణయించారట. 
 
కాగా, ఈ చిత్రంలో బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తే, హరికృష్ణగా కళ్యాణ్ రామ్, అక్కినేని నాగేశ్వర రావుగా సుమంత్, చంద్రబాబు నాయుడుగా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. రెండోభాగంలో వీరి పాత్రల నిడివి ఎక్కువగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments