Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 నుంచి జనవరి 8న గ్లింప్స్

Webdunia
సోమవారం, 1 జనవరి 2024 (13:10 IST)
Devara look
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్నభారీ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకుడు. శరవేగంగా సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయ్యింది. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రమిది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.
 
‘దేవర’ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుంది. అందులో పార్ట్ 1 ఈ ఏడాది ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతుంది. అభిమానులు, ప్రేక్షకులు దేవరతో కొరటాల శివ అండ్ టీమ్ క్రియేట్ చేసిన ఓ కొత్త ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
దేవర సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి తగ్గట్లు ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుంచి మేకర్స్ మరో అప్‌డేట్ అనౌన్స్ చేశారు. దేవర పార్ట్ 1 నుంచి ఎన్టీఆర్‌కు సంబంధించిన పవర్‌ఫుల్ లుక్‌ని కొత్త ఏడాది సందర్భంగా నిర్మాతలు విడుదల చేశారు. పోస్టర్‌ను గమనిస్తే..అలలతో ఎగిపిపడే సముద్రంలో బోట్‌పైన ఠీవిగా, స్టైల్‌గా నిలుచున్న తారక్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో నిర్మాతలు దేవర పార్ట్ 1 గ్లింప్స్ ను జనవరి 8న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
 
ఎప్పటి నుంచి దేవర అప్‌డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తోన్న అభిమానులు గ్లింప్స్ ఎలా ఉండబోతుందోనని మరింత ఉత్సాహాంగా ఉన్నారు. ఈ ప్రకటనతో ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ‘ఇంటర్నెట్‌లో టైగర్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. ప్రతీ ఒక్కరూ దేవర ప్రపంచానికి చూడటానికి విజువల్ ట్రీట్‌ను ఎంజాయ్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు’ అంటూ ‘దేవర’ నుంచి రాబోతున్న గ్లింప్స్‌పై  మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ స్పందించారు.
 
ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెప్పించనున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో  ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ భారీ చిత్రం రూపొందుతోంది. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నబిడ్డపై ప్రియుడు అత్యాచారం చేస్తుంటే గుడ్లప్పగించి చూసిన కన్నతల్లి!!

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments