ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆడియో డేట్ ఫిక్స్

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (12:18 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా రూపొందుతోన్న ఎన్టీఆర్ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ప‌క్కా ప్లాన్‌తో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క ఆడియో వేడుకను డిసెంబర్ 16న తిరుపతిలో గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానునున్నారు.
 
ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. దాంట్లో మొదటి భాగం కథానాయకుడు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని చూపించనున్నారు. విద్యాబాలన్, సుమంత్, రానా, నిత్య మీనన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్.బి.కె ఫిలిమ్స్, వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రిలీజ్‌కి ముందే ఈ సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. మ‌రి... రిలీజ్ త‌ర్వాత ఎలాంటి ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించ‌నుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Software engineer: ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ను ఆర్డర్ చేస్తే టైల్ ముక్క వచ్చింది.. (video)

బీహార్ వలస కార్మికులను తమిళనాడు సర్కారు వేధిస్తోందా?

సెలైన్ బాటిల్‌ను చేత్తో పట్టుకుని మార్కెట్‌లో సంచారం...

మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది: రైతులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

చిత్తూరు మేయర్ దంపతుల హత్య ఎలా జరిగిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments