Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరు రోజుల్లో బాహుబలి 2 కలెక్షన్లు రూ. 792 కోట్లు.. అమీర్ పీకే అవుట్.. 1,500 కోట్ల వసూళ్లపై కన్ను.. నోటమాట రాని బాలీవుడ్

సునామీ విధ్వంసం మహా అయితే పది నిమిషాలు ఉంటుంది. ఆ సమయంలో తనకు అడ్డువచ్చిన ప్రతిదాన్ని ఊతకోచ కూస్తూ, విధ్వసం చేసుకుంటూ పోవడమే దాని పని. ఆ పదినిమిషాల తర్వాత చూస్తే దాని ప్రభావంలోని సమస్త ప్రకృతీ నేల మట్

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (02:00 IST)
సునామీ విధ్వంసం మహా అయితే పది నిమిషాలు ఉంటుంది. ఆ సమయంలో తనకు అడ్డువచ్చిన ప్రతిదాన్ని ఊతకోచ కూస్తూ, విధ్వసం చేసుకుంటూ పోవడమే దాని పని. ఆ పదినిమిషాల తర్వాత చూస్తే దాని ప్రభావంలోని సమస్త ప్రకృతీ నేల మట్టం కావలిసిందే. ఆ పది నిమిషాల తర్వాత మళ్లీ మనక్కనిపించేది సముద్ర గంభీర ప్రశాంతత. కానీ బాహుబలి2 సినిమా గత ఆరు రోజులుగా చేస్తున్న విధ్వంసానికి ఏ పేరు పెట్టాలి? ఒకే ఒక్క సినిమా ప్రాంతీయ సరిహద్దులను దాటుకుని ప్రపంచ సినీ యవనిక మీదికి దూసుకెళ్లిన సినిమా కేవలం ఆరు రోజుల్లో ఇటు భారతీయ సినీరంగంలోని రికార్డులనే కాకుండా అంతర్జాతీయంగా భారతీయ సినిమాల సమస్త రికార్డులను చెరిపివేసింది.


ఎవరు ఔనన్నా కాదన్నా ఇప్పుడు రాజమౌళి తీసిన బాహుబలి 2 సినిమా భారతీయ చలనచిత్ర రారాజు. ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా వసూళ్లలో నెంబర్ వన్‌గా నిలిచిన అమీర్ ఖాన్ నటించిన పీకే (హిందీ) లైఫ్ టైమ్ రికార్డును బాహుబలి–2 ఆరంటే ఆరు రోజుల్లో బద్దలు కొట్టేసింది. పీకే మొత్తం వసూళ్లు 743 కోట్లు కాగా బాహుబలి2 ఆరు రోజుల వసూళ్లు 792 కోట్ల రూపాయలు.
 
రాజమౌళి సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యం ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. కొత్త అనుభూతిని మిగిల్చింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్, తమన్నా.. ఇలా అందరూ తమ నటనతో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. సినిమా మాత్రం ఇప్పటివరకూ మిగతా సినిమాలు సాధించిన రికార్డులను చెరిపేసింది. భారతీయ సినిమాల్లో ‘కలక్షన్‌ కింగ్‌’ అనిపించుకుంది

‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’. మొదటి భాగం (‘బాహుబలి: ది బిగినింగ్‌) దాదాపు 600 కోట్ల రూపాయలు వసూలు చేయగా రెండో భాగం అంతకు రెండింతలు పైనే వసూలు చేస్తుందని విశ్లేషకుల అంచనా. అందుకు నిదర్శనం ఈ చిత్రం ఆరో రోజు వసూళ్లు. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లల్లో నంబర్‌ వన్‌గా నిలిచిన భారతీయ సినిమా ‘పీకే’ (హిందీ) రికార్డ్‌ను ‘బాహుబలి–2’ బద్దలు కొట్టింది. ‘పీకే’ మొత్తం వసూళ్లు 743 కోట్ల రూపాయలు. ‘బాహుబలి’ ఆరో రోజుకే ఆ వసూళ్లను దాటేసింది. 
 
విడుదలైన అన్ని భాషలతో కలుపుకుని ఈ చిత్రం ఆరవ దినం అంటే బుధవారం చివరకి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 792 కోట్లు వసూలు చేసింది. మామూలుగా క్రేజీ ప్రాజెక్ట్‌కి మొదటి వారం టికెట్స్‌ దొరకవు. అయితే ‘బాహుబలి–2’కి వచ్చిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. రెండో వారానికి ఎంటరవుతున్నప్పటికీ టికెట్స్‌ సులువుగా దొరికే పరిస్థితి లేదు. దీన్నిబట్టి భవిష్యత్‌ వసూళ్లను ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. పది రోజుల్లో ఈ చిత్రం వెయ్యి కోట్లు వసూలు చేస్తుందని అంటున్నారు.

భారతీయ సినిమాల్లో మార్కెట్‌ పరంగా నంబర్‌ వన్‌ స్థానం హిందీ చిత్రాలదైతే ఇప్పుడా స్థానాన్ని ‘బాహుబలి’ దక్కించుకుంది. 1,000 నుంచి 1,500 కోట్లు ఫైనల్‌ కలెక్షన్స్‌ ఉంటాయని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ రికార్డ్‌ని సమీప కాలంలో ఏ భారతీయ సినిమా అధిగమించలేదని అంటున్నారు. మరి.. ‘బాహుబలి’ రికార్డ్‌ను ఏ సినిమా అధిగమిస్తుందో వేచి చూడాలి.
 
ఇప్పుడు మాటల్లేవు. ఎవరినోటా మాట రావడం లేదు. కళ్లముందు జరుగుతున్న ఈ సునామీ కలెక్షన్ల బీభత్సాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఊహకు కూడా అందటం లేదు. బాలీవుడ్ దిగ్భ్రాంతి. హాలీవుడ్లో విభ్రాంతి.. ప్రపంచంలో బాహుబలి2 విడుదలైన దేశాలన్నీ నిర్ఘాంత పోయే కలెక్షన్లు. ఇప్పుడు బాహుబలి లక్ష్యం 1,000 కోట్లు కాదు... రెండో వారాంతానికి అంటే వచ్చే ఆదివారానికి అవలీలగా వెయ్యి కోట్లు సాధిస్తుందన్న అంచనాల మధ్య సినిమా తాజా లక్ష్యం 1,500 కోట్లు. వస్తుందా రాదా అనే దిగులే వద్దు.. దాన్ని దాటిపోతుందని ట్రేడ్ ఎనలిస్టులు ముక్త కంఠంతో చెబుతున్నారు.

నిజంగానే ఇది బాహుబలి యుగం, రాజమౌళి శకం, ప్రభాస్ స్టారిజం దీన్ని కొట్టే సినిమా  రావాలంటే మరో పదేళ్లు పడుతుందని చిత్రరంగ నిపుణుల అంచనా. కథకు ఉన్న వాల్యూ తెలియని స్టార్ హీరోలు తమ తమ మేనరిజాలతో బతికేస్తున్న కాలంలో బాహుబలి  లాంటి కథను తయారు చేసేదెవరు. చేసినా దానికి సిద్ధపడేదెవరు. అంత కాలం వెచ్చించేదెవరు.. ఒక సినిమాకు అన్ని సంవత్సరాలు నమ్మి కట్టుబడేదెవరు. అందుకే బాహుబలి రికార్డుకు వచ్చే పదేళ్లలో  తిరుగు లేదన్నది నగ్నసత్యం.
 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments