Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుకు షాక్.. షోకాజ్ నోటీసులు జారీ.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (15:03 IST)
టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో మహేష్ బాబు గత ఏడాది వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టారు. గత ఏడాది డిసెంబర్ గచ్చిబౌలిలో మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ పేరుతో మల్టిఫ్లెక్స్‌ను ప్రారంభించారు. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ థియేటర్‌లు చాలా తక్కువకాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నాయి. అందులో అత్యాధునిక సౌకర్యాలు ఉండటంతో పాటుగా టాలీవుడ్ సెలబ్రిటీల వరుస సందర్శనల మరియు ప్రశంసలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఇది చిక్కులలో పడింది.
 
అయితే ఇందులో సినిమా చూడాలంటే జేబు నిండా బాగా డబ్బుండాల్సిందే. ఇటీవల జిఎస్‌టీ అధికారులు ఎఎమ్‌బి మల్టీప్లెక్స్‌ను సందర్శించి నిబంధనలను అతిక్రమిస్తున్నట్లు గుర్తించి, షోకాజ్ నోటసులను జారీ చేసారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సినిమా టికెట్‌లపై 28 శాతంగా ఉన్న జిఎస్‌టీని 18 శాతానికి తగ్గించారు. ఈ నిబంధన జనవరి 1 నుండి అమలులోకి వచ్చింది. అయినప్పటికీ ఏఎమ్‌బి మల్టీప్లెక్స్ మాత్రం 28 శాతం జీఎస్‌టీ ప్రకారం అధిక ధరలకు టిక్కెట్‌లను విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న  జీఎస్టీ అధికారులు తనిఖీ చేసి, షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments