Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటా ట్రైలర్ రిలీజ్.. రాజకీయ నాయకుడిగా అర్జున్ రెడ్డి అదరగొట్టాడు..

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో హిట్ కొట్టిన యంగ్ హీరో విజయ్ దేవర కొండ తాజాగా ''నోటా''తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గీత గోవిందం సినిమా ద్వారా కలెక్షన్లు అదరగొట్టిన విజయ్ దేవరకొండ.. తాజా సిని

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (17:39 IST)
అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో హిట్ కొట్టిన యంగ్ హీరో విజయ్ దేవర కొండ తాజాగా ''నోటా''తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గీత గోవిందం సినిమా ద్వారా కలెక్షన్లు అదరగొట్టిన విజయ్ దేవరకొండ.. తాజా సినిమా నోటా ట్రైలర్ గురువారం విడుదలైంది. ఇప్పటికే నోటా సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు ధీటుగా నోటా ట్రైలర్ అదరగొట్టింది. రౌడీగా, రాజకీయ నాయకుడిగా, లీడర్‌గా అర్జున్ రెడ్డి లుక్ అదిరిపోయింది. 
 
అర్జున్ రెడ్డితో సంచలనం రేపిన విజయ్.. తాజాగా గీతగోవిందంతో అగ్ర హీరో ముద్ర వేసుకున్నాడు. తాజా నోటాతో అగ్ర హీరోలకే పోటీగా నిలబడ్డాడు. పక్కా పొలిటికల్ డ్రామాగా నోటా తెరకెక్కుతోంది. ఇటీవలే మహేశ్ బాబు భరత్ అనే నేనుతో తెలుగునాట పొలిటికల్ డ్రామాలు కూడా హిట్ అవుతాయనే నమ్మకాన్ని కలిగించాడు. ప్రస్తుతం విజయ్ కూడా అదే బాట ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తున్నాడు. 
 
సిటీలో వున్న ప్రాంతాల్లో నీరు చేరాయి.. మనం గేట్లు ఎత్తేస్తే చాలా ప్రాంతాలు నీట మునుగుతాయ్ సార్.. అనే డైలాగ్‌తో నోటా ట్రైలర్ ప్రారంభం అవుతుంది. రాజకీయ నేతగా ఐడియా లేదు ఎక్స్‌పీరియన్స్ లేదు.. అనే విజయ్ డైలాగ్ బాగుంది. వీడియో గేమ్‌లో లాస్ట్‌గేమ్‌ను స్ట్రయిట్‌గా వెళ్లి ఆడావా ఎప్పుడైనా.. డమ్మీ సీఎం అంటే ఇంత డమ్మీగానా.. ఇది ముఖ్యమంత్రి పదవా..? మ్యూజిక్స్ ఛైర్ ఆటా?, అర్థరాత్రుల్లో ప్రకటన చేయడం ఫ్యాషనైపోయింది, ఓ రాష్ట్రం భవిత స్వామీజీ చేతుల్లోనా?, వెల్‌డన్ ఫకీ పాలిటీషియన్స్ అంటూ వచ్చిన డైలాగ్స్ అదిరిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments