Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫ్3 షూటింగ్ ముగిసిందా..? ఫన్‌కి సెలవులు ఉండవు..

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (09:48 IST)
F3
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి చేస్తున్న సినిమా ఎఫ్3 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన ఎఫ్2కు సీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు కథను లాక్‌డౌన్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపుడి సిద్ధం చేశాడు. ఎఫ్2ను డైరెక్ట్ చేసిన అనిల్ ఎఫ్3ని కూడా డైరెక్ట్ చేయనున్నారు.
 
దాదాపు ఎఫ్2కు పనిచేసిన వారే మరోసారి జతకట్టి ఎఫ్3ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి కొత్త అప్‌డేట్ ఇచ్చాడు దర్శకుడు అనిల్. ఈ సినిమాను కుదిరినంత త్వరగా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రీకరణను శరవేగంతో పూర్తి చేస్తున్నామని, చివరికీ వారంతాల్లో కూడా సెలవులే తీసుకోకుండా చేస్తున్నామన్నాడు. 
 
అంతేకాకుండా ఫన్‌కి సెలవులు ఉండవంటూ ఎఫ్3 సెట్స్‌ నుంచి ఓ ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోలో హీరో వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపుడి, నిర్మాత దిల్ రాజు, సునీల్ కలిసిన కూర్చుని ఉన్నారు. ఈ సినిమాలో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చాలా కొత్త తరహాలో ఉండబోతుందని, దీనిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments