Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ 'పేట' చిత్రానికి థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదు : 'దిల్' రాజు

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (08:38 IST)
తెలుగు చిత్రాలను కాదని పరభాషా చిత్రాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదని ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు వ్యాఖ్యానించారు. పైగా, సంక్రాంతికి బరిలో ఉన్న "ఎన్టీఆర్ కథానాయకుడు", "వినయ విధేయ రామ", "ఎఫ్-2" చిత్రాల విడుదల తేదీని ఆర్నెల్ల క్రితమే ప్రకటించారనీ, అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లను ఈ మూడు ప్రధాన చిత్రాలకు సర్దినట్టు చెప్పారు. 
 
రజినీకాంత్ కొత్త చిత్రం 'పేట'కు థియేటర్లు ఇవ్వడం లేదని చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ చేసిన వ్యాఖ్యలపై దిల్ రాజు ఘాటుగానే స్పందించారు. ఆర్నెల్ల క్రితం విడుదల తేదీని ప్రకటించిన చిత్రాలను కాదని ఇతర భాషా చిత్రాలకు థియేటర్లు ఇవ్వలేమన్నారు. ముఖ్యంగా 20 రోజుల క్రితం 'పేట' చిత్రాన్ని కొనుగోలు చేసి ఇపుడు వచ్చి థియేటర్లు కావాలని కోరితే ఎలా అని చెప్పారు. థియేటర్లను ఎలా సర్దుబాటు చేయగలమన్నారు. 
 
డబ్బింగ్ సినిమా 'సర్కారు', 'నవాబ్' వంటి చిత్రాలకు ఎన్ని థియేటర్స్‌లో కావాలంటే అన్ని థియేటర్లలో వేసుకున్నారని గుర్తు చేసిన 'దిల్' రాజు రాజు... సంక్రాంతి సీజన్‌లో మాత్రం ఇతర భాషా చిత్రాలకు థియేటర్లు లభించడం లేదన్నారు. ఏదైనా తొందరపడి ప్రకటనలు చేయవద్దని కోరారు. అదేసమయంలో 'పేట' చిత్రాన్ని 18వ తేదీన విడుదల చేసుకుంటే ఎన్ని థియేటర్లు కావాలన్నా కేటాయిస్తామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

KTR: కేసీఆర్‌కు కవిత లేఖ.. కేటీఆర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే?

Amaravati : అమరావతిలో ప్రపంచ స్థాయి విమానాశ్రయం.. చంద్రబాబు ప్లాన్

Monsoon to hit kerala: మరో 24 గంటల్లో కేరళను తాకనున్న ఋతుపవనాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments