Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పద్మావతి'ని ఎందుకు నిషేధిస్తారు? సీఎంలకు సుప్రీం మొట్టికాయలు

"పద్మావతి" చిత్ర యూనిట్‌కు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. అలాగే, ఈ చిత్రం తమతమ రాష్ట్రాల్లో విడుదలకాకుండా నిషేధం విధించిన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులపై అత్యున్నత న్యాయస్థానం మండిపడింది

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (15:20 IST)
"పద్మావతి" చిత్ర యూనిట్‌కు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. అలాగే, ఈ చిత్రం తమతమ రాష్ట్రాల్లో విడుదలకాకుండా నిషేధం విధించిన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులపై అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. సున్నితమైన అంశాలపై బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని కోర్టు మొట్టికాయలు వేసింది. 
 
'పద్మావతి' సినిమాపై నిషేధం విధించాలని, దర్శకుడిపై, నిర్మాతలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టి దాన్ని కొట్టేసింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్‌పై జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
అంతేకాకుండా, పద్మావతి సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, నిషేధిస్తున్నట్లు ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రులపై, మంత్రులపై సుప్రీం కోర్టు మండిపడింది. ఇలాంటి సెన్సార్ బోర్డు పరిశీలనకు కూడా వెళ్లని సినిమాపై వివాదాస్పద పోస్ట్‌లు పెట్టి రెచ్చగొట్టే ధోరణులను మానుకోవాలని సూచించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, పోస్ట్‌లు పెట్టడం చట్టాన్ని అతిక్రమించడమేనని సుప్రీం కోర్టు పేర్కొంది. 
 
కాగా, దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ కాంబినేషన్‌లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం పద్మావతి విడుదలకు రాజ్‌పుత్ కర్ణిసేన వర్గం నేతలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న విషయం తెల్సిందే. దీంతో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కూడా ఈ చిత్రం విడుదలపై 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

జాతర ముసుగులో అసభ్య నృత్యాలు.. నిద్రపోతున్న పోలీసులు (Video)

ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే నిర్ణయం

బ్రో అని పిలిచినందుకు - స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఇంటి యజమాని దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments