ఎన్‌.టి.ఆర్‌. డెడికేష‌న్‌కు నివేదా ఫిదా

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (10:03 IST)
Ntr junio at zym
యంగ్ టైగర్ ఎన్టీఆర్. త‌ను ఏం చేసినా డెడికేష‌న్‌తో చేస్తారు. సినిమాలోని పాత్ర‌ల‌కు అనుగుణంగా త‌న బాడీని మార్చుకోవ‌డం చేస్తుంటాడు. ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా త‌ర్వాత ఇప్పుడు తాజాగా ఆయ‌న కొర‌టాల శివ సినిమాను చేయాల్సివుంది. ఆచార్య సినిమా ఫెయిల్యూర్ త‌ర్వాత ఎన్‌.టిఆర్‌.తో చేస్తాడోలేదో కొర‌టాల అంటూ సోష‌ల్ మీడియాలో తెగ వార్త‌లు వ‌చ్చాయి. కానీ ముందుగా చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం ఆయ‌న ఆ సినిమా చేయాలి. ఆ త‌ర్వాత స‌లార్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు ఎన్‌.టి.ఆర్‌.
 
ఎప్పుడూ ఫిట్‌గా వుండే ఎన్‌.టి.ఆర్‌. మ‌రింత ఫిట్‌గా వుండేందుకు వ్యాయామాలు చేస్తున్నాడు. త‌న ట్రైనీతో క‌లిసి జిమ్‌లో ఇలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. కాళ్ళ‌కు త‌గిన బ‌లం రావ‌డానికి చేస్తున్న ఈ భంగిమ‌ల‌ను చిన్న‌వీడియో తీసి త‌న సోష‌ల్‌మీడియాలో ఎన్‌టి.ఆర్‌. పోస్ట్ చేశాడు. ఎన్‌.టి.ఆర్‌. డెడికేష‌న్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇటీవ‌లే రెజీనా, నివేద ఇద్ద‌రూ కూడా టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ తార‌క్‌ను ప్ర‌శంస‌లు కురిపించారు. ఎన్టీఆర్ తో కలిసి లవకుశ సినిమాలో నటించిన‌నివేద, ఆయన ఎన‌ర్జీ అద్భుతం అని.. ఎప్పుడు ఎంత పనిచేసినా కూడా అలసిపోవడం అంటూ ఉండదని. షూటింగ్ కు వచ్చినప్పుడు ఎంత ప్రెష్ గా ఉంటారో.. ఇంటికెళ్ళేప్పుడు కూడా అలానే ఉంటారంటుంది చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments