Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్ సినిమాకి ముహుర్తం ఖ‌రారు.!

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (20:06 IST)
యువ హీరో నితిన్ లై, ఛ‌ల్ మోహ‌న రంగా, శ్రీనివాస క‌ళ్యాణం చిత్రాల‌తో ఫ్లాప్స్‌లో హ్యాట్రిక్ సాధించాడు. దీంతో కెరీర్లో వెన‌క‌బ‌డిన నితిన్ ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో భీష్మ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి కానీ... నితిన్‌కి భుజం గాయం కారణంగా కొన్ని నెలలుగా కెమెరా ముందుకు రాలేదు. భీష్మా టైటిల్‌కి ది బ్యాచిలర్‌ అనేది ట్యాగ్ లైన్. అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెల 25న స్టార్ట్‌ చేయనున్నారట.
 
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పైన నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నితిన్ స‌ర‌స‌న రష్మికా మందన్నా హీరోయిన్‌గా ఖ‌రారు చేసారు. ఛలో తరహాలోనే ఈ భీష్మా కూడా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా ప్లాన్‌ చేశారట. ఈ సినిమా త‌ర్వాత కుమారి 21ఎఫ్‌ ఫేమ్‌ సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మించనున్న ఓ సినిమాను నితిన్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలతో నితిన్ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

నడి రోడ్డుపై కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి (Video)

Telangana tunnel tragedy: తెలంగాణ సొరంగంలో రెస్క్యూ పనులు.. మానవ అవశేషాల జాడలు

ఐఐటీ బాంబే క్యాంపస్‌లో మొసలి కలకలం - హడలిపోయిన విద్యార్థులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments