Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌లో మహానటిగా నిత్యామీనన్..

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ''ఎన్టీఆర్'' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కాల్షీట్స్

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (15:13 IST)
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ''ఎన్టీఆర్'' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కాల్షీట్స్‌లో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ పాత్రకు నిత్యామీనన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 
 
ఇందులో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బసవతారకంగా బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ నటిస్తుండగా, చంద్రబాబు నాయుడిగా రానా, ఏఎన్నార్‌గా సుమంత్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 'మహానటి' సావిత్రి పాత్రలో నిత్యా మీనన్‌ నటించనున్నారట. ఎన్టీఆర్‌, సావిత్రి కలిసి ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించారు. అందులో 'మిస్సమ్మ', 'మాయాబజార్‌', 'రక్త సంబంధం' చిత్రాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. 
 
ఇకపోతే.. ఎన్టీఆర్‌ కుమార్తె పురంధేశ్వరిగా ప్రముఖ నృత్య కారిణి హిమన్సీ నటిస్తున్నట్టు సమాచారం. ఈ బయోపిక్‌ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మరోవైపు జయలలిత జీవితం ఆధారంగా రూపొందనున్న 'ది ఐరన్‌ లేడీ' బయోపిక్‌లో నిత్యామీనన్‌ జయలలితగానూ నటించే అవకాశం ఉందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments