Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్, వెంకీ కుడుముల, మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం రాబిన్‌హుడ్

డీవీ
శనివారం, 30 మార్చి 2024 (16:09 IST)
Nithin, Robinhood
హీరో నితిన్ తనకు బ్లాక్ బస్టర్ 'భీష్మ' అందించిన దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తున్న'రాబిన్‌హుడ్' చిత్రంతో ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ హ్యుమరస్ యాక్షన్ అడ్వెంచర్ టీజర్‌లో నితిన్ దొంగగా కనిపించారు. వెంకీ కుడుముల నితిన్ పాత్రను చాలా యూనిక్ ప్రజెంట్ చేశారు.
 
నితిన్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంగా, రాబిన్‌హుడ్ మేకర్స్ సరికొత్త పోస్టర్‌తో ముందుకు వచ్చారు. సినిమాలో ట్రెండీ లుక్‌ లో కనిపించిన నితిన్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్‌లో తన అన్ బిటబుల్ స్టైల్‌ని చూపించారు. బ్లూటూత్ డివైజ్ లో మాట్లాడుతూ, గ్రేస్ ఫుల్ గా నడుస్తూ కనిపించారు. నితిన్  ప్యాంట్‌ పాకెట్స్ లో గన్స్ కూడా వున్నాయి. అతను ఏజెంట్ లాగా ఉన్నాడు. టీ-షర్టుపై ఏజెంట్ RH (రాబిన్‌హుడ్) అని రాసుంది. బ్లాక్ షేడ్స్, వాచ్‌తో పోస్టర్‌ అద్భుతమైన స్వాగ్ తో కనిపించారు నితిన్. ఇది నితిన్ అభిమానులకు ప్లజంట్ సర్ ప్రైజ్ ఇచ్చింది.  
 
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్ కోసం అద్భుతమైన స్కోర్‌ను అందించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలిగాలులు

మండుతున్న మణిపూర్‌.. మరింతగా క్షీణించిన శాంతిభద్రతుల... అదనపు బలగాలు..

శ్రీవారి ఆలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ దర్శనం ఇక 2 గంటలే!

నిజామాబాద్‌ నగర మేయర్ భర్తపై ఆటో డ్రైవర్ సుత్తితో దాడి (Video)

ఆగిన గుండె... ఈసీపీఆర్‌ ప్రయోగంతో మళ్లీ చలనం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments