Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ రీమేక్‌లో చైతు న‌టిస్తున్నాడా..?

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (19:32 IST)
అక్కినేని నాగచైత‌న్య ప్ర‌స్తుతం "వెంకీమామ" సినిమా చేస్తున్నాడు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అక్టోబ‌రు నెలాఖ‌రున ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవ‌ల శేఖ‌ర్ క‌మ్ముల‌తో సినిమా స్టార్ట్ చేశాడు. ఇందులో చైతు స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి న‌టిస్తుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... గ‌త ఏడాది విడుద‌లైన 'బ‌దాయి హో' సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌నుకుంటున్నారు.
 
ఈ సినిమాను తెలుగులో బోనీక‌పూర్, దిల్‌రాజు క‌లిసి నిర్మించ‌బోతున్నారు. ఇప్ప‌టికే గ్రౌండ్ వ‌ర్క్ స్టార్ట్ చేసేశార‌ట‌. స్క్రిప్ట్ అంతా ఫైన‌లైజ్ అయిన త‌ర్వాత ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులంటూకాకుండా ముందు నుండే ప్లానింగ్ చేసుకుంటున్నార‌ట‌. వీలైనంత త్వ‌ర‌గా సినిమాను స్టార్ట్ చేసి పూర్తి చేయాల‌ని బోనీక‌పూర్‌, దిల్‌రాజు భావిస్తున్నార‌ట‌. హిందీలో ఆయుష్మాన్ ఖురానా చేసిన పాత్ర‌లో చైత‌న్య క‌నిపిస్తార‌ట‌.
 
బాలీవుడ్‌లో సీనియ‌ర్ నిర్మాత అయిన బోనీక‌పూర్ ఈ యేడాది అజిత్ న‌టించిన 'నెర్కొండ పార్వై' చిత్రంతో త‌మిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా అక్క‌డ చాలా పెద్ద హిట్ అయ్యింది. అది కూడా అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించిన పింక్‌కి రీమేక్‌. ఇప్పుడు అజిత్‌తో మ‌రో సినిమాను ట్రాక్ ఎక్కించేస్తున్నారు బోనీక‌పూర్‌. 
 
కోలీవుడ్ త‌ర్వాత టాలీవుడ్ ఎంట్రీకి నిర్మాత‌గా రంగం సిద్ధం చేసేసుకున్నారు బోనీ క‌పూర్‌. శ్రీదేవి భ‌ర్త అయిన బోనీక‌పూర్ హిందీ నిర్మాతే అయినా.. తెలుగు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో ఆయ‌న‌కు మంచి అనుబంధం ఉందనే సంగ‌తి తెలిసిందే. మ‌రి... ఈ రీమేక్ తో చైతు మ‌రో విజ‌యం సొంతం చేసుకుంటాడేమో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments