Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బింగ్‌ పూర్తిచేసుకున్న 'నిన్నే కోరుకుంటా'

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (19:36 IST)
శుభకరి క్రియేషన్స్‌ పతాకంపై విజయ్‌భాస్కర్‌, వివేక్‌, ఆనంద్‌, పూజిత మొదలగువారు ప్రధాన తారాగణంగా గణమురళి దర్శకత్వంలో నిర్మాత మరిపి విద్యాసాగర్‌ నిర్మిస్తున్న చిత్రం 'నిన్నే కోరుకుంటా'. ప్రస్తుతం ఈ చిత్రం ఎడిటింగ్‌లతో పాటు డబ్బింగ్‌ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మరిపి విద్యాసాగర్‌(వినయ్‌) మాట్లాడుతూ.. ఇదొక రొమాంటిక్‌ కామెడీ మూవీ. సినిమా అంతా ప్రేక్షకుల్ని ఫుల్‌గా నవ్విస్తుంది. నేటి యువతీ యువకుల మనస్థత్వాలను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ సినిమాలో చేస్తున్న ఆర్టిస్ట్‌లందరూ సినిమాకోసం ఎంతగానో సహకరించారు. దర్శకుడు గణమురళి.. చెప్పినదానికంటే గొప్పగా చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రస్తుతం ఎడిటింగ్‌, డబ్బింగ్‌ పూర్తయ్యాయి. త్వరలో ఆడియో విడుదల చేసి, ఆ వెనువెంటనే సినిమాని కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము.. అన్నారు.
 
విజయ్‌భాస్కర్‌, వివేక్‌, ఆనంద్‌, పూజిత, వైజాగ్‌ ప్రసాద్‌, పూర్ణిమ, సారిక, ప్రదీప్‌, సత్యం రాజేష్‌, సుమన్‌శెట్టి, కొండవలస, సంజన, అంబటి శ్రీను, ప్రసాద్‌ చౌదరి మొదలగువారు నటించిన ఈ చిత్రానికి మాటలు: సాహు, ప్రకాష్‌, మాధవ్‌, పాటలు: పోతుల రవికిరణ్‌, కులశేఖర్‌, సంగీతం: ప్రణవ్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, నిర్మాత: మరిపి విద్యాసాగర్‌(వినయ్‌), కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గణమురళి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంటీ అని దగ్గరయ్యాడు: అవి ఇవ్వు అన్నందుకు గుండెల్లో పొడిచిన ప్రియుడు

ఖాకీల సమయస్ఫూర్తి .. ఆత్మహత్యకు యత్నించిన యువతిని కాపాడారు..

Ram Gopal Varma: ప్రకాశం జిల్లాకు రానున్న రామ్ గోపాల్ వర్మ.. ఎందుకో తెలుసా?

అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను సుపారీ ఇచ్చి హత్య చేయించిన ప్రియుడి ఫ్యామిలీ!!

అమరావతి నిర్మాణ పనులు సాఫీగా చేసుకోవచ్చు : ఎన్నికల సంఘం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

Show comments