Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న నిఖిల్ సిద్ధార్థ్ "కార్తికేయ-2"

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (14:03 IST)
యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం "కార్తికేయ2". ఇటీవల విడుదలైన ఈ చిత్రం నిఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. రూ.30 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కింది. అలాగే, ఆరంభంలో 50 స్క్రీన్‌లలో మాత్రమే రిలీజ్ చేశారు. కానీ, ఈ చిత్రానికి వచ్చిన ప్రేక్షకాధారణతో ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రదర్శించే స్క్రీన్‌ల సంఖ్య 3 వేలకు పెంచారు. అలాగే, కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 60.12 కోట్ల రూపాయల మేరకు కలెక్షన్లు రాబట్టింది. 
 
కేవలం ప్రేక్షలు మౌత్ టాక్‌తోనే ఈ చిత్రం సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన తొలి వారంలో ఆదివారం, ఆగస్టు 15, కృష్ణాష్టమి సెలవులు ఈ చిత్రానికి బాగా కలిసివచ్చాయి. వీకెండ్‌లోనే కాకుండా, మంగళ, బుధ, గురువారాల్లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. దీనికితోడు ప్రతిరోజూ ప్రదర్శించే షోల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ఫలితంగా 50 స్క్రీన్‌ల నుంచి 3 వేల స్క్రీన్‌ల వరకు పెంచారు. 
 
ఈ చిత్రం శ్రీకృష్ణుడికి సంబంధించిన కథ కావడంతో హిందీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అలాగే, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ చిన్న పాత్రను కూడా పోషించారు. ఫలితంగా అమీర్ ఖాన్ "లాల్ సింగ్ చద్దా", అక్షయ్ కుమార్ "రక్షా బంధన్" వంటి చిత్రాలను తోసిరాజని సూపర్ హిట్ టాక్‌తో కనకవర్షం కురిపిస్తుంది. ఈ రెండు బాలీవుడ్ చిత్రాలు ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరచడం "కార్తికేయ-2"కు బాగా కలిసివచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments