Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద నోట్లు రద్దయినా ధైర్యం చేసి విడుద‌ల చేశారు... నిఖిల్

``ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమా స‌మ‌యంలో 500, 1000 క్యాన్సిల్ చేయ‌డంతో ఎలా విడుద‌ల చేస్తారోన‌ని అనుకున్నాం. అయితే నిర్మాత‌లు ధైర్యం చేసి విడుద‌ల చేశారు. ఈ సినిమా ఇంత పెద్ద స‌క్సెస్ అయ్యిందంటే కార‌ణం నిర్మాత‌ల‌కే క్రెడిట్ ద‌క్కుతుంది. తెలుగు ప్రే

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (20:00 IST)
``ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమా స‌మ‌యంలో 500, 1000 క్యాన్సిల్ చేయ‌డంతో ఎలా విడుద‌ల చేస్తారోన‌ని అనుకున్నాం. అయితే నిర్మాత‌లు ధైర్యం చేసి విడుద‌ల చేశారు. ఈ సినిమా ఇంత పెద్ద స‌క్సెస్ అయ్యిందంటే కార‌ణం నిర్మాత‌ల‌కే క్రెడిట్ ద‌క్కుతుంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు యూనానిమ‌స్‌గా పెద్ద స‌క్సెస్ చేశారు. ఇంత పెద్ద విజ‌యంలో ద‌ర్శ‌కుడు ఆనంద్‌గారు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ చంద్ర‌, సినిమాటోగ్రాఫ‌ర్ సాయిశ్రీరామ్ చోటా కె.ప్ర‌సాద్ భాగ‌మయ్యారు. అంద‌రికీ థాంక్స్‌. సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమాను డేడికేట్ చేస్తున్నాను`` నిఖిల్ అన్నారు.
 
నిఖిల్‌, హెబ్బాప‌టేల్‌, నందిత‌శ్వేత‌, అవికాగోర్ హీరో హీరోయిన్లుగా మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా`. ఈ సినిమా 18న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో థాంక్స్‌మీట్ జ‌రిగింది.
 
ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ మాట్లాడుతూ - `నా హృద‌యానికి ద‌గ్గ‌రైన క‌థ‌తో రూపొందింది. 2001లో సినిమా రంగంలోకి ఎంట‌ర్ అయిన నాకు 2016లో ద‌ర్శ‌కుడిగా పెద్ద స‌క్సెస్ ద‌క్కింది. టైగ‌ర్ సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుండి ఈ సినిమా కోసం నిఖిల్‌, నిర్మాతగారితో జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. సాయిశ్రీరామ్‌, శేఖ‌ర్ చంద్ర స‌హా అంద‌రూ టెక్నిషియ‌న్స్ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లారు. రామ‌జోగ‌య్య‌శాస్త్రి, శ్రీమ‌ణి మంచి సాహిత్యంను అందిస్తే, అబ్బూరి ర‌వి అద్భుత‌మైన డైలాగ్స్‌ను అందించారు. హెబ్బా చాలా హార్డ్ వ‌ర్క్ చేసి న‌టించింది. నందిత‌శ్వేత మంచి పెర్‌ఫార్మెన్స్ చేసింది. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments