Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖిల్,అనుపమ పరమేశ్వరన్ 18 పేజిస్ నుండి లిరికల్ వీడియో విడుదల

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2022 (20:43 IST)
Nikhil, Anupama Parameswaran
వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న "జీఏ 2" పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం "18 పేజిస్" నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.  ఇదివరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. 
 
ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు  నిఖిల్ సిద్ధార్థ & అనుపమ పరమేశ్వరన్. కృష్ణ తత్వాన్ని, కృష్ణ సారాంశాన్ని చెప్పిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలక్షన్స్ సాధించింది. అంతటి ఘనవిజయం సాధించిన కార్తికేయ- 2 తరువాత అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ జంటగా చేస్తున్న చిత్రం కావడంతో ఈ "18 పేజిస్" సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.  
 
తాజాగా "18 పేజిస్" చిత్రం నుండి "నన్నయ్య రాసిన" అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటను లిరిసిస్ట్ శ్రీమణి రచించారు. 
ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పెలైన తెలిపేనా 
ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైన చూపేనా 
నీలో స్వరాలకే నేనే సంగీతమై 
నువ్వే వదిలేసిన పాటై సాగేనా 
నన్నయ్య రాసిన కావ్యమగితే, తిక్కన తీర్చేనుగా 
రాధమ్మ ఆపిన పాట మధురిమా కృష్ణుడు పాడెనుగా 
అని శ్రీమణి రచించిన లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తున్నాయి. 
ఈ  చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. "నన్నయ్య రాసిన"  పాటను పృథ్వి చంద్ర, సితార కృష్ణ కుమార్ ఆలపించారు. ఈ పాట వినసొంపుగా ఉంది. ఖచ్చితంగా ఈ పాట మంచి మెలోడీ హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 
 
ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని పుష్ప దర్శకుడు సుకుమార్ రాశారు. ఇదివరకే గతంలో  కుమారి 21 ఎఫ్ చిత్రంతో హిట్ అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు. 
సాంగ్: నన్నయ్య రాసిన 
సింగర్స్: పృథ్వి చంద్ర, సితార కృష్ణ కుమార్ 
సాహిత్యం: శ్రీమణి 
 
తారాగణం: నిఖిల్ సిద్దార్థ & అనుపమ పరమేశ్వరన్
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్ 
కథ: సుకుమార్
ప్రొడక్షన్: GA2 పిక్చర్స్ & సుకుమార్ రైటింగ్స్
నిర్మాత: బన్నీ వాస్
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: వసంత్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: రమణ వంక
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శరణ్ రాపర్తి (గీతా ఆర్ట్స్), అశోక్ బండ్రెడ్డి
రచయిత: శ్రీకాంత్ విస్సా
లైన్ ప్రొడ్యూసర్: బాబు 
పిఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, మేఘ శ్యామ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రంథాలయం- నారా లోకేష్

వంగవీటి మోహన రంగా విగ్రహాలపై అలా చేస్తారా? చంద్రబాబు సీరియస్

SVSN Varma: పవన్ కల్యాణ్‌కు పిఠాపురం ఇచ్చిన వర్మ.. చంద్రబాబు కలిసి కనిపించారే!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments