''నిక్యాంక'' పెళ్ళి ఫోటోలు.. నెట్టింట వైరల్.. (Photos)

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (18:50 IST)
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అమెరికా సింగర్ నిక్‌ల పెళ్లి ఫోటోలు రిలీజ్ అయ్యాయి. తాజాగా ''నిక్యాంక'' క్రైస్తవ, హిందూ సంప్రదాయాల వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. క్రైస్తవ వివాహం కోసం ప్రియాంక పొడవాటి తెలుపు రంగు గౌనులో, హిందూ పద్ధతిలో  వివాహం కోసం ఎరుపు రంగు లెహంగాలో మెరిసింది. నిక్ కూడా షేర్వానీ, కోట్ సూట్‌లో అదిరిపోయాడు. 
 
వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గత 8 నెలల పాటు ప్రియాంక అమెరికాకు చెందిన సింగర్ నిక్‌తో ప్రేమలో వున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో వీరి నిశ్చితార్థం జరిగింది. వయస్సులో తనకంటే 11 ఏళ్ల చిన్నవాడైన నిక్‌ను ప్రియాంక పెళ్లాడింది. ఐదు రోజుల పాటు నిక్, ప్రియాంక వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. 
 
జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. డిసెంబర్ 1న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం, డిసెంబర్ 2న హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుక జరిగింది. కాగా ఢిల్లీలో వీరి వివాహ విందును ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి బాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments