Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి వారసుడొచ్బాడు. కీరవాణి వారసులు కూడా తయారయ్యారా?

కీరవాణి శిబిరం నుంచి తదుపరి సంగీత దర్శక వారసత్వం మొదలైందా.. అంటే అవుననే చెప్పాలి. కీరవాణి ఇద్దరు పుత్రులు సింహ కోడూరి, కాల భైరవ ఇటీవలే సోషల్ మీడియాలో ప్రవేశించారు. బాహుబలి సినిమాలో రెండు పాటలను కాలభైరవ స్వయంగా పాడినట్లు తెలుస్తోంది. అంటే కీరవాణి కుటు

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (01:43 IST)
వర్తమాన సినీ ప్రపంచంలో తిరుగులేని సంగీత దర్శకుడు ఎవరంటే ఎంఎం కీరవాణి అనే చెప్పాలి. అన్నమయ్యతో మొదలైన (అంటే ఇది ప్రారంభం కాదు) ఆయన మనోహర సంగీత వైదుష్యం బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. బాహుబలి 2 సినిమా ఆడియో ప్రదర్శన మరో మూడు రోజుల్లో అంటే మార్చి 25న రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. 
 
కీరవాణి శిబిరం నుంచి తదుపరి సంగీత దర్శక వారసత్వం మొదలైందా.. అంటే అవుననే చెప్పాలి. కీరవాణి ఇద్దరు పుత్రులు సింహ కోడూరి, కాల భైరవ ఇటీవలే సోషల్ మీడియాలో ప్రవేశించారు. బాహుబలి సినిమాలో రెండు పాటలను కాలభైరవ స్వయంగా పాడినట్లు తెలుస్తోంది. అంటే కీరవాణి కుటుంబం కుటుంబం మొత్తం బాహుబలితో కనెక్ట్ అయినట్లే. కీరవాణి ఈ సినిమాలో రెండు పాటలు రాయగా ఆయన తండ్రి, పాటల రచయిత కూడా మరొక పాటల రచయితతో కలిసి ఒక పాట రాశారు. 
 
కాగా రాజమౌళి కుమారుడు కార్తికేయ ఇప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాహుబలి సినిమాకు పనిచేసిన విషయం తెలిసిందే. పైగా ఇతడు బాహుబలి సినిమాకు సర్వమూ తానేై వ్యవహరించి తండ్రి ప్రశంసలందుకున్నాడు కూడా. దీంతో కీరవాణి కూడా పరోక్షంగా తన వారసులను ప్రకటించాడనే చెప్పాలి. 
 
ఏం ప్యామిలీ అనుకోవాలి. ఫ్యామిలీ ఫ్యామిలీ టిపిన్ తినే బతికేస్తున్నారా నాన్నా అంటూ మహేష్ పోకిరి సినిమాలో జోక్ పేల్చినట్లు కుటుంబం కుటుంబమే సినిమా వ్యాపారంలో దిగిపోయిందేమిటి అని జనం నోళ్లు నొక్కుకుంటున్నారు. ఎఁత వారసత్వం అనుకున్నప్పటికీ రాజమౌళి, కీరవాణి ఇస్తున్న నాణ్యతను ఎవరూ తప్పుపట్టలేరు. వీరీ  వారసులు కూడా విరీకోవలోనే సాగాలని ఆశిద్దాం.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకు దక్కనిది మరెవరికీ దక్కదు : ప్రియురాలి గొంతుకోసి హత్య

చీరకట్టులో ఉన్న అందమే వేరు.. కానీ చీరలో అర్ధనగ్నంగా కనిపించి పరువు తీసింది.. (video)

ఢిల్లీలో ఉండబుద్ధి కావడం లేదు : నితిన్ గడ్కరీ

గుజరాత్- మహిసాగర్ నదిపై గంభీర బ్రిడ్జీ కుప్పకూలింది.. ముగ్గురు మృతి (video)

వాట్సాప్ గ్రూపుల ఏర్పాటు కూడా ర్యాగింగ్‌తో సమానం : యూజీసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments