'మా'లో కొత్త ట్విస్ట్ : మూకుమ్మడి రాజీనామాలు ఎక్కడికి దారితీస్తాయి...

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (10:23 IST)
ఎంతో ఆసక్తిని రేకెత్తించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంతవరకు బాగానే వుంది. కానీ, ఈ ఎన్నికల ఫలితాల తర్వాత సరికొత్త ట్విస్ట్ మొదలైంది. ఈ ఫలితాలు వెల్లడైన తర్వాత పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌, నాగబాబు 'మా' సభ్యత్వానికి రాజీనామా చేయడం, అనంతరం ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలను ప్రకటించడం సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 
 
ముఖ్యంగా, మా అధ్యక్ష బాధ్యతలను కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు స్వీకరించకముందే ఆయన ముందు అనేక సవాళ్లు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా, మా కొత్త కమిటీకి ఎన్నికైన 11 మంది చేసిన మూకుమ్మడి రాజీనామాలను విష్ణు ఆమోదిస్తారా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
 
సాధారణంగా మా అసోసియేషన్‌లో ఏదైనా ఒక పదవి ఖాళీ ఏర్పడితే, దాన్ని భర్తీ చేసే అధికారి మా అధ్యక్షుడిగా ఉంటుంది. 'మా' బైలాస్‌ నిబంధన ప్రకారం.. మా సభ్యుడి పోస్ట్‌కు ఖాళీ ఏర్పడితే.. ప్రెసిడెంట్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయం తీసుకొని దాన్ని భర్తీ చేస్తారు. 
 
దీనికి జనరల్‌ బాడీ సభ్యులందరి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి మూకుమ్మడి రాజీనామాలను సైతం ఆమోదించి ఆ స్థానంలో కొత్తవారిని నామినేట్‌ చేస్తారా? లేక బుజ్జగింపులు చేసి రాజీనామాలను వెనక్కి తీసుకునేలా ఒప్పిస్తారా అనేది వేచిచూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments