Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి దుర్గ తేజ్ సంబరాల యేటిగట్టు నుంచి హోలీ న్యూ పోస్టర్‌

దేవీ
శుక్రవారం, 14 మార్చి 2025 (12:44 IST)
Sai Durga Tej holy poster
హీరో సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటిగట్టు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ లో సాయి దుర్ఘ తేజ్‌ సరికొత్త లుక్లో కనిపించనున్నారు. బ్లాక్‌బస్టర్ హనుమాన్‌తో భారీ విజయం సాధించిన తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
హోలీ శుభ సందర్భంగా, మేకర్స్ బ్రాండ్ న్యూ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఇది మొత్తం టీం వారి ముఖాల్లో ఆనందంతో నిండినట్లు చూపిస్తుంది. సాయితేజ్ తన టీం ఉత్సాహపరిచేందుకు తన చేతిని పైకెత్తడం కనిపిస్తుంది. ఈ గెస్చర్ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది.
 
ఇప్పటికే విడుదలైన కార్నేజ్ టీజర్  ట్రెమండస్ రెస్పాన్స్ తో సంబరాల యేటిగట్టు చుట్టూ ఉన్న బజ్  నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది సంబరాల యేటిగట్టు షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం టీం హైదరాబాద్‌లో ఒక పాటను చిత్రీకరిస్తోంది.
 
భారీ బడ్జెట్‌తో సంబరాల యేటిగట్టు సాయి దుర్గ తేజ్‌కు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌లో అద్భుతమైన సాంకేతిక బృందం ఉంది. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, నవీన్ విజయ కృష్ణ ఎడిటింగ్, గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు  
ఐశ్వర్య లక్ష్మి నాయికగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

Mega DSC: 16,347 పోస్టులలో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు

వైకాపాకు జగన్ అధ్యక్షుడు కాదు.. రాబందుల పార్టీకి చీఫ్ : మంత్రి నిమ్మల

అనారోగ్యంతో మరణించిన బాలిక... టెన్త్ ఫలితాల్లో స్కూల్ టాపర్

రోడ్డుపై నడుస్తూ వెళ్లిన ముస్లిం మహిళను ఢీకొన్న కారు.. ఆ బాలుడు ఏం చేశాడంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments