Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధు జొన్న‌ల‌గడ్డ హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (17:30 IST)
Sidhu Jonnalagadda, aravind
డీజే టిల్లు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న వెర్స‌టైల్ యాక్ట‌ర్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ  ఎస్‌వీసీసీ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న 37వ సినిమా గురువారం లాంఛ‌నంగా ప్రారంభమైంది. బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో బొమ్మరిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌కుడిగా ఈ సినిమాను సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. 
 
ముహూర్త‌పు స‌న్నివేశానికి ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా, స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి మైత్రీ మూవీ మేక‌ర్స్ ర‌విశంక‌ర్‌, యువీ క్రియేష‌న్స్ వంశీ, దామోద‌ర్ ప్ర‌సాద్‌, నందినీ రెడ్డి, రాధా మోహ‌న్‌, కార్తీక్ వ‌ర్మ‌, సుబ్బు, మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి, కోన వెంక‌ట్, నీర‌జ కోన త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. 
 
ఈ సంద‌ర్బంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘ భాస్క‌ర్ డైరెక్ట‌ర్‌గా సిద్ధు జొన్నలగడ్డతో మా బ్యానర్‌లో సినిమా చేయ‌టం ఎంతో హ్యాపీగా ఉంది. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమా ఉంటుంది. హీరోయిన్ స‌హా ఇత‌ర న‌టీనటులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియజేస్తాం’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలుడిని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి.. అక్కడే హత్య.. వాడు మనిషేనా?

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదు.. బాలికను కిడ్నాప్ చేశారు.. కానీ 2 గంటల్లోనే?

ప్రియుడితో ఏకాంతంగా లేడీ పోలీస్, భర్త వచ్చేసరికి మంచం కింద దాచేసింది

అమెరికా అదనపు సుంకాలు.. భారత్‌కు రిలీఫ్.. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే?

Atal Bihari Vajpayee: అటల్ బిహారీ వాజ్‌పేయి ఏడవ వర్ధంతి..ప్రముఖుల నివాళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments