Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 3వ తేదీ ‘నేత్ర’ రిలీజ్

స్టార్‌ మేకర్‌ సత్యానంద్‌ తనయుడుతో కలిసి మొట్ట మొదటిసారిగా నటిస్తోన్న చిత్రం ‘నేత్ర’. మై స్వీట్‌ హార్ట్‌ అనేది ట్యాగ్‌లైన్‌. రామ్‌ కియేషన్స్‌ పతాకంపై పీరికట్ల రాము నిర్మిస్తున్నారు. గోపీచరణ్‌, ఐశ్వర్

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (18:00 IST)
స్టార్‌ మేకర్‌ సత్యానంద్‌ తనయుడుతో కలిసి మొట్ట మొదటిసారిగా నటిస్తోన్న చిత్రం ‘నేత్ర’. మై స్వీట్‌ హార్ట్‌ అనేది ట్యాగ్‌లైన్‌. రామ్‌ కియేషన్స్‌ పతాకంపై పీరికట్ల రాము నిర్మిస్తున్నారు. గోపీచరణ్‌, ఐశ్వర్య అడ్డా జంటగా నటించగా..  రెడ్డెం యాదకుమార్‌ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల‌కు సిద్ధమైంది. 
 
నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ... ‘అన్ని వర్గాల‌ ప్రేక్షకులు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. స్టార్‌ మేకర్‌ సత్యానంద్‌గారు, వారి అబ్బాయి తొలిసారిగా మా చిత్రంలో నటించారు. సినిమాను చూసి సెన్సార్‌ వారు  కూడా ప్రశంసించారు. ఫిబ్రవరి 3న అత్యధిక థియేటర్లలో విడుదల‌ చేస్తున్నాం’ అన్నారు.
 
చిత్ర దర్శకుడు రెడ్డెం యాదకుమార్‌ మాట్లాడుతూ... ‘మా చిత్ర ఆడియోకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. బిజినెస్‌ పరంగా మంచి స్పందన వచ్చింది. మా చిత్రంలో హర్రర్‌తో పాటు స్వచ్ఛమైన ప్రేమ కథ కూడా ఉంటుంది. హీరో  గోపిచరణ్‌, హీరోయిన్‌ ఐశ్వర్య జంట బాగుందంటున్నారు. కెమెరా పనితనం, సంగీతం సినిమాకు హైలైట్స్‌.  
 
ఏ విషయంలో కాంప్రమైజ్‌ కాలేదు. సెన్సార్‌ సభ్యులు ‘ఓ ఫ్రెష్‌ ఫిలిం చూశాము’ అని చెప్పడంతో మాకు సినిమాపై మరింత నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా ఆడియన్స్‌కు నేత్రానందాన్ని కలిగించే విధంగా మా ‘నేత్ర’ చిత్రం ఉంటుంది. ఫిబ్రవరి 3న అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా  సినిమాను విడుదల‌ చేస్తున్నాం’ అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

పహల్గామ్ ఉగ్రదాడి : కాశ్మీర్‌కు బుక్కింగ్స్‌ను రద్దు చేసుకుంటున్న టూరిస్టులు!!

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments