Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను స్టూడెంట్ సార్ అంటోన్న బెల్లంకొండ గణేష్

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (17:32 IST)
Bellamkonda Ganesh
'స్వాతిముత్యం' సినిమాతో అరంగేట్రం చేస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమాని ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో చేస్తున్నారు. బ్యానర్ నుండి ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న చిత్రమిది. తొలి చిత్రం 'నాంది' విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ గా విజయవంతమైంది.‘నాంది’ సతీష్ వర్మ మరో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు. ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో యూనిక్ థ్రిల్లర్‌గా ఉండబోతోంది.
 
ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ చిత్రానికి  'నేను స్టూడెంట్ సర్! ' టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గాయపడిన గణేష్ తన స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్‌ని చూపుతుండగా అతని చుట్టూ తుపాకులు గురిపెట్టడం ఇంట్రస్టింగ్ గా వుంది. ఫస్ట్ లుక్ లో  గణేష్  టెర్రిఫిక్ గా కనిపించాడు.'' నాంది'' లాగానే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే రెండో సినిమా కూడా ఒక యూనిక్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
 
సముద్రఖని, సునీల్  కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మధాడి డీవోపీగా,  చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్  అందిస్తున్నారు.
సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
 
నటీనటులు: బెల్లంకొండ గణేష్, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి సాయితేజ తదితరులు.
సాంకేతిక విభాగం
దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి
నిర్మాత: ‘నాంది’ సతీష్ వర్మ
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: అనిత్ మధాడి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
కథ: కృష్ణ చైతన్య
డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి
కొరియోగ్రఫీ: రఘు మాస్టర్
ఫైట్స్: రామకృష్ణన్
పీఆర్వో  వంశీ-శేఖర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments