Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని నేను లోకల్ ట్రైలర్ రిలీజ్.. అమ్మాయి తెల్లవారుజామున 4 గంటలకు చదివితే మార్చి.. అదే అబ్బాయి?

నేచురల్ స్టార్ నాని కథలు ఎంచుకోవడంలో దిట్ట. మాస్‌కు దగ్గరగా ఉన్న స్కిప్ట్‌లు ఎంచుకుని తనలోని నటనను వెలికితీసి ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాడు. ప్రస్తుతం ''నేను లోకల్'' సినిమాతో మాస్ ఇమేజ్‌ను పెంచుకున

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (12:04 IST)
నేచురల్ స్టార్ నాని కథలు ఎంచుకోవడంలో దిట్ట. మాస్‌కు దగ్గరగా ఉన్న స్కిప్ట్‌లు ఎంచుకుని తనలోని నటనను వెలికితీసి ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాడు. ప్రస్తుతం ''నేను లోకల్'' సినిమాతో మాస్ ఇమేజ్‌ను పెంచుకునేందుకు సిద్ధమవుతున్నాడు. సినిమా చూపిస్తా మావా ఫేం నక్కిన త్రినాథ రావు డైరక్షన్లో ఇప్పుడు హీరో నాని వచ్చేస్తున్నాడు. వీరు తీసిన నేను లోకల్ సినిమా ట్రైలర్ రిలీజైంది. 
 
ఆద్యంతం వినోద్మాతకంగా సాగే ఈ ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. కాలేజీకి వెళ్ళి కేవలం చదువుకోవడమే కాకుండా.. ఒక అమ్మాయిని ప్రేమించే యువకుడు 'బాబు' పాత్రలో నాని రక్తి కట్టించేశాడు. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ కూడా మరోసారి తన టాలెంట్‌తో ఆకట్టుకుంది. 'వీడు మాములోడు కాదే. జండూబామ్కు కూడా తలనొప్పి తెప్పించే రకం' అంటూ నాని మీద హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ వేసే పంచ్ తో.. తెగ నవ్వులొచ్చేస్తాయి. అలాగే 'పరిగెత్తి.. పరిగెత్తి బతికేదానిని జింకా అంటారు. ఆగి.. ఆగి.. కొట్టేదాన్ని పులి అంటారు' అంటూ నాని ఒక మాస్ డైలాగ్ ను పేల్చడం చూస్తే.. సినిమా ఏ లెవెల్లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. 
 
అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందంచిన మ్యూజిక్ కూడా సినిమాకు పెద్ద ఎస్సెట్ అనే చెప్పాలి. చూస్తుంటే ఫిబ్రవరిలో రిలీజయ్యే ఈ సినిమాతో నిర్మాత దిల్ రాజు మరో హిట్టు కొట్టేశేలా ఉన్నాడు. యాక్షన్, ఇటు కామెడీ, పంచ్ డైలాగులు ఈ ట్రైలర్‌లో పేలాయి. "ఒక అమ్మాయి తెల్లవారుజామున 4 గంటలకు చదువుకుంటోందంటే.. అది మార్చి అని అర్థం. ఒక అబ్బాయి తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుకుంటున్నాడంటే అది సెప్టెంబర్‌ అని అర్థం. ద రిలేషన్‌ షిప్‌ బిట్విన్‌ మార్చి అండ్‌ సెప్టెంబర్‌ షుడ్‌ బి లైక్‌ ఎ ఫిష్‌...’’ అంటూ నాని చెప్పిన డైలాగ్ అలరిస్తోంది. ఈ ట్రైలర్‌పై దాదాపు ఐదున్నర లక్షల మంది దీన్ని వీక్షించారు.

 

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సింగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments